లఘు ఉద్యోగ భారతి ఉమ్మడి కృష్ణా చాప్టర్ ఏర్పాటు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన అధికారిక ఎంఎస్‌ఎంఈ వ్యవస్థ లఘు ఉద్యోగ భారతి ఉమ్మడి కృష్ణా చాప్టర్ ఏర్పాటైంది. మహాత్మాగాంధీ రోడ్డులోని అమరావతి హౌసింగ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ శాఖను జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ మోహన్ సుందరం ఏపీ అధ్యక్షుడు తులసీ యోగీష్ చంద్రతో కలిసి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ సుందరం మాట్లాడుతూ.. లఘు ఉద్యోగ భారతి దేశం వ్యాప్తంగా 68 వేల ఎంఎస్‌ఎంఈ యూనిట్ల సభ్యత్వం కలిగి ఉందన్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద ఎంఎస్‌ఎంఈ సంస్థని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రామకృష్ణ కూడా పాల్గొన్నారు.
ఉమ్మడి కృష్ణా కార్యవర్గం ఇదే..
లఘు ఉద్యోగ భారతి ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడిగా వెలగపూడి సాంబశివరావు, కార్యదర్శిగా చెరుకూరి చాముండేశ్వరి, జాయింట్ జనరల్ సెక్రటరీగా డాక్టర్ తరుణ్ కాకాని, ఉపాధ్యక్షులుగా టి.వెంకట నాగేశ్వరరావు, అన్నే శ్రీనివాసరావు, శ్రీరామ్, కార్యదర్శులుగా జె.అభినయ్‌కృష్ణ, యార్లగడ్డ హరీష్, కార్యనిర్వాహక సభ్యులుగా దొడ్డపనేని కల్యాణ్ కృష్ణ, ప్రణీత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు.


