ముగిసిన యూపీఎస్సీ ఈపీఎఫ్‌ఓ పరీక్ష
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/ వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): ఎన్‌ఫోర్స్ మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన ఈపీఎఫ్‌ఓ పరీక్ష– 2025 ముగిసింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీకి నగరంలోని 15 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరిగింది. 5,860 మంది అభ్యర్థులకు 2,183 మంది (37.25 శాతం) హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విజయవాడలోని సీవీఆర్ ఉన్నత పాఠశాల, చిట్టూరి హైస్కూల్, ప్రభాస్ పీజీ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయడానికి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఇబ్బంది లేకుండా పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన లైజనింగ్ అధికారులు, వెన్యూ సూపర్‌వైజర్లు, సమన్వయ శాఖల అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ అభినందనలు తెలిపారు.
చిట్టూరి హైస్కూల్ పరీక్ష కేంద్రంలో కలెక్టర్ లక్ష్మీశ, ఇతర అధికారులు


