కరాటే పోటీల్లో విజయవాడ విద్యార
భవానీపురం(విజయవాడపశ్చిమ): కర్నాటక రాష్ట్రం మైసూర్‌లోని చాముండి విహార్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 8వ గోజురియో కరాటే అకాడమీ (జేకేఏ) ఓపెన్ నేషనల్ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో విజయవాడకు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. జీకేఏ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్. మహేష్, టోర్నమెంట్ చీఫ్ రిఫరీ అండ్ టెక్నికల్ డైరెక్టర్ ఎస్. ప్రతిభన్ నేతృత్వంలో జరిగిన ఈ పోటీలో విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన పది మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో కటా అండర్–12 కేటగిరీలో హిమశ్రీ మొదటి స్థానంలో నిలవగా అండర్–11 కేటగిరీలో వరుణ్‌బాబు, అండర్–10 కేటగిరీలో మోహన్ ద్వితీయ స్థానంలో నిలిచారు. అదే విధంగా అండర్–7, 8, 11, 12, 13, 22 కేటగిరీలలో యక్షిత్, హరియాక్ష్, ఆధ్యశ్రీ, ధువన్, లీలానాథ్, ప్రియ, అనూష తృతీయ స్థానంలో నిలిచి బహుమతులు అందుకున్నారు. విజేతలను విజయవాడకు చెందిన జేకే జీకేఏ వ్యవస్థాపకుడు జె. శ్రీనివాసులు, టెక్నికల్ డైరెక్టర్ జె. హరినాథ్, సత్యనారాయణపురం బ్రాంచి హెడ్ కోచ్ పి. హర్ష, ఇన్‌స్ట్రక్టర్లు బి. నరసింహ, సీహెచ్ మహేష్‌బాబు అభినందించారు.


