గిరిజనులు భారతీయ సంస్కృతికి వారసులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): కల్మషం లేని స్వచ్ఛమైన మనసు కలిగిన ఆదివాసీ, గిరిజనులు భారతీయ సంస్కృతికి వారసులని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్‌గా సోళ్ల బొజ్జిరెడ్డి, సభ్యులుగా గొర్లె సునీత, కాకి లక్ష్మి, పి.వెంకటప్ప, మల్లేశ్వరరావు కడ్రక, కిల్లో సాయిరామ్ సోమవారం ఆర్‌అండ్‌బీ బిల్డింగ్‌లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అభినందన సభకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లపై ఉందన్నారు. స్వాతంత్య్రోద్యమంలో గిరిజన తెగలకు చెందిన బిర్సా ముండా, కొమరం భీమ్ వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, ఎమ్మెల్యే మిరియాల శిరీష, ఎస్సీ కమిషన్ సెక్రటరీ చిన్న రాములు, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సదా భార్గవి బొజ్జరెడ్డి, సభ్యులను అభినందించారు. తొలుత ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థినులు ప్రదర్శించిన గిరిజన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
సత్యకుమార్ యాదవ్


