
బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. శాసనసభలో హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికారు. అలా తాము కూడా మాట్లాడగలమని, కానీ మాకు సంస్కారం ఉందన్నారు. ప్రజా సమస్యలు చర్చించేందుకు శాసన సభ నిర్వహిస్తున్నారా... మాజీ ముఖ్యమంత్రిని విమర్శించడానికి సభ నిర్వహిస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా, చెప్పుకోవడానికి చేసిందేమి లేక, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ విస్మరించి, సూపర్‌సిక్స్‌ను సూపర్ ప్లాప్ చేసి వాటి నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని తెలిపారు. హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి విచ్చలవిడిగా దొరు కుతుందని, వాటిని అరికట్టడంతో విఫలమైన ప్రభుత్వం, రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టారన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే బాలకృష్ణ శాసనసభలో ఎలా హుందాగా వ్యవహరించాలో తెలుసుకోవాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్
పామర్రు:అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అపాయింట్‌మెంట్ కోసం మాజీ మంత్రి పేర్రి నానికి కాల్ చేయటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ పెద్ద సైకో అని ధ్వజమెత్తారు. అభిమానులు సెల్ఫీ దిగడానికి వస్తే వారి సెల్ ఫోన్ లాక్కొని పగలగొట్టి సైకోలా ప్రవర్తించింది బాలకృష్ణనే అన్నారు. వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడికీ లేదన్నారు. తమ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం