
సంక్షేమ పథకాలను సద్వినియోగించుకోవాలి
నందిగామరూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని పాడి రైతులు ఆర్థికంగా ఎదగాలని ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ షణ్ముఖ కుమార్, అడిషనల్ కమిషనర్ శివప్రసాద్, జాయింట్ కమిషనర్ శివరామ్ పేర్కొన్నారు. మండలంలోని మునగచర్ల గ్రామంలోని సామూహిక పశు వసతి గృహాన్ని శనివారం వారు పరిశీలించారు. ముందుగా సామూహిక పశు వసతి గృహ నిర్వహణ, పశుగ్రాస పెంపకంపై చేస్తున్న అధ్యయనం తదితర అంశాలను కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. అనంతరం గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ పంగలూరి నరసింహారావు, డ్వామా పీడీ రాము, జేడీ హనుమంతరావు, ఎంపీడీవో ప్రసాదరావు, డెప్యూటీ ఎంపీడీవో నామేశ్వరరావు, ఏపీవో శరత్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకం
రాష్ట్ర డైరెక్టర్ షణ్ముఖ కుమార్