
ప్రభుత్వ తీరు సరికాదు..
మీడియా గొంతునొక్కే కుట్రలు చేయటం సరికాదు. మీడియా వల్లే సమాజంలో ఉన్న అనేక సమస్యలు వెలుగుచూస్తున్నాయి. సమాజ గతిని నిర్ణయిస్తున్నాయి. పాలకుల వైఫల్యాలను బహిర్గతం చేయటం తప్పు అనేట్లుగా ప్రస్తుత విధానాలు కనిపిస్తున్నాయి. మీడియా ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాల్లో వాస్తవాలు లేకపోతే ఖండించాలి. అంతే తప్ప కేసులు నమోదుచేయటం, ఇబ్బందులకు గురిచేయటం సరైంది కాదు. దేశ ప్రగతిలో ముఖ్యభూమిక పోషిస్తున్న మీడియా పట్ల అనుచితంగా వ్యవహరించటం మానుకోవాలి. కచ్చితంగా మూల్యం చెల్లించుకునేందుకు పాలకపక్షాలు సిద్ధంగా ఉండాలి.
– నక్కా శ్రీనివాసరావు, సగర సంఘం రాష్ట్ర నాయకుడు, కోలవెన్ను

ప్రభుత్వ తీరు సరికాదు..