
ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం
రైతులకు యూరియా కూడా అందించలేని అసమర్థ పాలనను ఇప్పుడే చూస్తున్నాం. యూరియా కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్ దందాతో కూటమి నేతలు రూ.కోట్లు దండుకొంటున్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి, రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాడుతుంది. రైతుల సమస్యల విషయంలో అన్నదాత పోరుతో ప్రభుత్వం కళ్లు తెరి పిద్దాం. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా అందజేయా లని డిమాండ్ చేస్తున్నాం. అన్నదాత పోరులో రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి.
– దేవినేని అవినాష్, వైఎస్సార్ సీపీ
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు