
అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలు స్వాధీనం
తక్కెళ్లపాడు(జగ్గయ్యపేట): గ్రామంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్ ఏడీ వీరాస్వామి శనివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం గ్రామంలోని సర్వే నంబరు 120లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నట్లు డీడీ శ్రీనివాస్‌కు సమాచారం వచ్చిందన్నారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో ట్రాక్టర్‌ను, జేసీబీను స్వాధీనం చేసుకుని వీఆర్వో శ్రీనివాస్‌కు అప్పగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాయల్టీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.