
లోడింగ్‌ను అడ్డుకున్న లారీ యజమానులు
ప్రైవేట్ సంస్థతో కుదుర్చుకున్న ఎన్టీటీపీఎస్ కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని స్థానిక లారీ ఓనర్లు, డ్రైవర్లు శనివారం లోడింగ్ పనులను అడ్డుకున్నారు. బూడిదకు డిమాండ్ లేని సమయంలో ఎన్టీటీపీఎస్ అధికారుల సలహాతో ఈ ప్రాంతానికి చెందిన తాము సుమారు 400 లారీలు కొనుగోలు చేసి 30 ఏళ్లుగా బూడిద రవాణాపై ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు. దూరం బట్టి లారీ బూడిదను రూ.6 వేల నుంచి రూ.8 వేలకు విక్రయిస్తున్న తాము ఇప్పుడు లారీకి రూ.3 వేల నుంచి రూ.4 వేలు చెల్లిస్తే లాభం ఏముంటుందని ప్రశ్నించారు. డ్రైవర్లు, క్లీనర్లకు జీతాలు, డీజిల్ ఖర్చులకే వచ్చే ఆదాయం సరిపోతే తాము ఎలా బతకాలని వాపోతున్నారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థకే సుమారు 300లపైగా లారీలు ఉన్నాయని తెలుస్తోందని, తమకు అసలు బూడిద ఇస్తుందో లేదో కూడా తెలియదని స్థానిక లారీ ఓనర్లు ఆందోళన చెందుతున్నారు.