
పది గంటలు!
‘మన గ్రోమోర్’లో మాత్రమే..
ప్రతి
శుక్రవారం
డయల్
యువర్
కలెక్టర్
కృష్ణా జిల్లా వ్యాప్తంగా అవే తిప్పలు
తెల్లవారుజాము 4 గంటల నుంచే పడిగాపులు
తిండీతిప్పలు లేకుండా వృద్ధుల అగచాట్లు
‘కూటమి’కి అనుకూలం అయితే అధికంగా కట్టలు
కొన్నిచోట్ల తోపులాటలు, ఘర్షణలు
వాళ్లకు అనుకూలం అయితే ఓకే..
● యూరియా కొరత.. రైతన్న కుతకుత!
ఒక్క కట్ట కోసం..
ఇంతటి దారిద్య్రం ఎప్పుడూ లేదని అన్నదాతల ఆక్రందన
అవనిగడ్డ/కంకిపాడు: ఎరువుల కొరత రోజు రోజుకీ తీవ్రతరమవుతోంది. పంటకు అవసరమైన సమయంలో యూరియా దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మార్కెట్‌లో యూరియా ఎప్పుడు వస్తుందా? అన్న ఆశతో ఎరువుల దుకాణాల వద్దే రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు.
కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1.64 లక్షల హెక్టార్లలో సాగుకు అనువైన భూమి ఉంది. ఇప్పటి వరకూ 1.34 లక్షల హెక్టార్లలో వరి నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెండు నెలల నుంచి నెల రోజుల పంట పొలాల్లో ఉంది. కొన్ని గ్రామాల్లో వరిపైర్లు దుబ్బు చేసి చిరు పొట్ట దశకు చేరువ అవుతున్నాయి.
యూరియా లభ్యతపై జిల్లా వ్యవసాయశాఖ చెబుతున్న లెక్కలకు, వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదు. ఆగస్టు నాటికి 27,299టన్నులు యూరియా జిల్లాకు అవసరమని వ్యవసాయశాఖ నివేదికలు పేర్కొంటున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో ఉన్న యూరియా నిల్వలతో కలిపి 28,743టన్నులు ఉండగా ఆగస్టు నాటికి 27,299 మెట్రిక్ టన్నులు అమ్మకాలు జరిగాయని, ఇంకా 1,443 టన్నులు యూరియా మార్కెట్‌లో నిల్వ ఉందని లెక్కలు చూపిస్తున్నారు. వాస్తవానికి యూరియా దొరక్క రైతులు విలవిల్లాడుతున్నారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో ఆలస్యంగా సాగు చేసిన అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో పిండి (ఎరువులు) చల్లేందుకు సిద్ధంగా ఉన్నారు. బుధవారం కొన్ని చోట్లకు యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు తెల్లవారు జాము నుంచే పీఏసీఎస్‌లు, రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. మొత్తం 322.425 టన్నుల యూరియా లోడ్లు వచ్చాయి. వీటి కోసం లైన్లు వేసేందుకు కొన్నిచోట్ల రైతుల మధ్య తోపులాటలు, స్వల్ప ఘర్షణలు జరిగాయి. పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేశారు. వచ్చిన లోడులు తక్కువ కావడంతో చాలా మంది రైతులకు యూరియా అందలేదు.
నాట్లు వేసిన వారం పదిరోజుల లోపు యూరియా, కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు. కొన్నిచోట్ల 30 నుంచి 40 రోజులు అయినా యూరియా అందకపోవడం వల్ల ఎరువులు వేయలేదు. దీంతో పిలకలు పెరగక పంట ఎదుగుదల లేకుండా పోయిందని కొంతమంది రైతులు చెప్పారు. 40 నుంచి 50 రోజులు దాటితే పిలకలు పుట్టవని, అప్పుడు ఎరువులు వేసినా ఉపయోగం లేదని రైతులు చెబుతున్నారు.
ఎకరం అంతకంటే తక్కువ ఉంటే కట్ట చొప్పున యూరియా ఇచ్చారు. రెండు నుంచి ఐదు ఎకరాలు ఉంటే రెండు కట్టలు ఇచ్చారు. కానీ కూటమి పార్టీలకు అనుకూలమైన వారు వస్తే మూడు, నాలుగు కట్టలు కూడా ఇచ్చారు. ఐదు, పదెకరాలు కౌలుకు సాగుచేస్తున్న కొంతమంది రైతులకు రెండు కట్టల కంటే మించి ఇవ్వలేదు. వాళ్లిచ్చే యూరియా సగానికి కూడా చాలదని ఏమి చేయాలో తెలియడం లేదని కొంతమంది కౌలురైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నాకు ఒక ఎకరం సొంత పొలం ఉండగా, మూడు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నా. యూరియా కోసం తెల్లవారుజామున 5 గంటల వచ్చాను. పది గంటలు పడిగాపులు పడితే ఒక కట్ట యూరియా ఇచ్చారు. ఇంతవరకూ ముఖం కూడా కడగలేదు. నాలుగు ఎకరాలకు కనీసం రెండు కట్టలయినా కావాలి. ఒకకట్ట ఇస్తే ఎలా సరిపెట్టాలి. ఇంత దరిద్రం ఎప్పుడూ లేదు.
– బచ్చు నాగబసవయ్య, మోదుమూడి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ఖరీఫ్–2025 సీజన్‌కు సంబంధించి ఎరువుల సరఫరాపై సమస్యలు, ఫిర్యాదులతో పాటు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రతి శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో అవసరాల మేరకు సమృద్ధిగా ఎరువులు ఉన్నాయన్నారు. ఎరువుల పంపిణీ ఏర్పాట్లు, ఫిర్యాదులు, సమస్యలను 91549 70454కు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్‌కు తెలియజేయవచ్చన్నారు.

పది గంటలు!