
ఏకదంతుడి లడ్డూ రూ.లక్ష
గుడివాడ టౌన్: పెద ఎరికపాడులోని శ్రీ కోదండ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మహోత్సవాల పందిరిలో స్వామివారి లడ్డూ ప్రసాదం వేలం ఆదివారం జరిగింది. పలువురు భక్తులు వేలంలో పాల్గొనగా అదే ప్రాంతానికి చెందిన పోతుల శ్రీకాంత్ స్వామివారి లడ్డూను లక్ష వెయ్యి రూపాయలకు పాడుకొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బైక్‌పై నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటన కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా విశ్వనాథపురం బ్యాంక్ కాలనీకి చెందిన బసు పృథ్వీరాజ్(22) విజయవాడ యనమలకుదురు కరకట్ట ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడు. పోరంకి లోని ఓ కళ్లజోళ్ల షాపులో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భార్యతో ఫోన్‌లో మాట్లాడాడు. ఆతర్వాత తన బుల్లెట్‌పై భవానీపురం ఆశ్రమం రోడ్డుకు వచ్చి అక్కడ జరిగిన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. తిరిగి తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో రూంకు వెళ్తుండగా కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై లోటస్ అపార్ట్‌మెంట్ సమీపంలోకి వచ్చే సరికే బుల్లెట్ స్కిడ్ అయి అదుపు తప్పి డివైడర్‌కు ఢీ కొట్టింది. బండిపై నుంచి పృధ్వీరాజ్ ఎగిరిఫ్లైఓవర్ అవతలి వైపు పడిపోయాడు. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనసై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇబ్రహీంపట్నం: వీటీపీఎస్ ఆఫీసర్స్ కన్స్యూమర్స్ కో–ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ సంస్థ పర్యవేక్షణలో నిర్వహించే పెట్రోల్ బంక్‌లో నగదు గోల్‌మాల్ జరిగిన విషయంలో ముగ్గురు వ్యక్తులకు ప్రధాన పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. బంక్‌లో పనిచేసి అదృశ్యమైన కాంట్రాక్ట్ కార్మికుడు గోపాలకృష్ణను ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ విచారణలో ముగ్గురు పేర్లు తెలిసినట్లు సమాచారం. వీరిలో ఇద్దరు సొసైటీలో ప్రధాన వ్యక్తులు కాగా, మరొకరు స్థానికంగా పనిచేసే ఓ ప్రముఖ టీవీ చానల్ రిపోర్టర్ (సాక్షి కాదు) అని తెలిసింది. అయితే ముగ్గురితో పాటు సంబంధం లేని వ్యక్తులను కూడా ఇందులోకి లాగాలని కొందరు కూటమి నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది.