
సిప్ అబాకస్ విజేతలకు అభినందన
భవానీపురం(విజయవాడపశ్చిమ): సిప్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సిప్ అబాకస్ పోటీలో గెలిచిన విద్యార్థులను ఆదివారం భవానీపురంలోని ఇన్‌స్టిట్యూట్‌లో అభినందించారు. ఈ సందర్భంగా సెంటర్ హెడ్ మధుసూదనరావు మాట్లాడుతూ ఇటీవల మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన సిప్ అబాకస్ పోటీలో 5–11 నిముషాల వ్యవధిలో 80 నుంచి 160 వరకు క్యాలిక్యులేషన్స్‌ను సాల్వ్ చేశారని తెలిపారు. ఈ పోటీలో భవానీపురం, వన్‌టౌన్ బ్రాంచిల నుంచి 180 మంది విద్యార్థులు పాల్గొనగా 157 మంది వివిధ కేటగిరీల్లో విజయం సాధించారని చెప్పారు. ఈ విద్యార్థులు నవంబర్ 16న చైన్నెలో నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఏపీలో మూడోసారి అత్యధిక విజేతలతో తమ బ్రాంచి మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. 18 ఏళ్లల్లో దాదాపు 5వేల మంది విద్యార్థులను మెరుగైన ప్రతిభావంతులుగా తీర్చిదిద్దామని తెలిపారు.