
బాల్య వివాహాల నియంత్రణకు సహకరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): బాల్యవివాహాలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగ ణంలోని న్యాయసేవాసదన్‌లో శనివారం బాల్యవివా హాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ మాట్లాడుతూ.. బాల్యవివాహాలు జరగకుండా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. ఎక్కడైన బాల్యవివాహాలు జరిగినట్లు తెలిస్తే వెంటనే సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇస్తే నియంత్రించేందుకు అవకాశం ఉంటుందన్నారు. చిన్న వయసులో గర్భధారణ వల్ల కలిగే నష్టాలు ఎన్నో ఉంటాయన్నారు. రక్తహీనత, పిల్లలు సరిగ్గా పుట్టకపోవటం తదితర పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. ఇందుకోసం బాల్యవివాహాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. బాలలకు సంబంధించిన హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి.రామ కృష్ణయ్య, పదో తరగతి జిల్లా న్యాయమూర్తి బి.బాబు నాయక్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.పోతురాజు, డీఎస్పీ చప్పిడి రాజా, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీ