
రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) శుక్రవారం కేసు నమోదు చేశారు. జీఆర్‌పీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ విజయవాడ స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్ పదిపై ఆగింది. ఈ క్రమంలో ఆ రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు తోటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ పార్థసారథి రైలు వద్దకు చేరుకుని ప్రయాణికుల నుంచి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని వయస్సు సుమారు 45 ఏళ్లు ఉంటుందని, ఒంటిపై పసుపు, నీలం రంగు గళ్ల ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నీలం, కుంకుమ రంగు గళ్ల లుంగీ ధరించి ఉన్నాడని, కుడి మోచేతి కింది భాగంలో ‘ఎన్టీఆర్’ అనే ఇంగ్లిష్ అక్షరాలు ఉన్నాయని, ఇతర ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్‌పీ స్టేషన్‌లో గాని లేదా 8897156153 నంబర్ ద్వారా సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.