టెండర్ల వాయిదాల పర్వం | - | Sakshi
Sakshi News home page

టెండర్ల వాయిదాల పర్వం

Aug 26 2025 8:26 AM | Updated on Aug 26 2025 8:26 AM

టెండర

టెండర్ల వాయిదాల పర్వం

మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025 u8లో టెండర్ల వాయిదాల పర్వం దివ్యాంగ పింఛన్లపై కూటమి కుట్ర ఎడ్లంక వాసుల దీక్ష విరమణ స్మార్ట్‌ కార్డులతో లబ్ధిదారులకు ప్రయోజనం

న్యూస్‌రీల్‌

గణపతి బప్పా మోరియా

ఈవీఎం గోదాముల తనిఖీలు

పది పనులకు టెండర్లు..

విజయవాడ సిటీ
ఎన్టీఆర్‌ జిల్లా
మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025
u8లో
అయినవారి కోసమేనా

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా కలెక్టరేట్‌ వద్ద పింఛన్ల తొలగింపును నిరసిస్తూ దివ్యాంగులు సోమవారం ధర్నా చేశారు. పింఛన్ల తొలగింపుపై పునరాలోచించాలని కోరారు.

అవనిగడ్డ: నాలుగు రోజులుగా చేస్తున్న దీక్షను ఎడ్లంక గ్రామస్తులు సోమవారం విరమించారు. శాశ్వత నివాసం కోసం గ్రామాన్ని వదిలి వేరే చోట ఇళ్ల స్థలాలు తీసుకునేందుకు ముందుకు వచ్చిన వారి నుంచి అర్జీలు తీసు కోవాలని కలెక్టర్‌ డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించారు. దీంతో గ్రామస్తులు దీక్ష విర మించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఎడ్లంకకు చెందిన 81 మంది ఇళ్ల స్థలాల కోసం తహసీల్దార్‌ నాగమల్లేశ్వరరావుకు అర్జీలు అందజేశారు. దీనికి సంబంధించి మంగళవారం నుంచి అధికారులు ఎడ్లంక గ్రామస్తుల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. తమ సమస్యకు అధికారులు చొరవ చూపినందున తాత్కాలికంగా దీక్షను నిలిపివేశామని గ్రామస్తులు తెలిపారు. ఎడ్లంక గ్రామస్తుల సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్‌ బాలాజీ, ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపాలనమాలమహానాడు జిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్‌ కోరారు. దీక్షలో వార్డు సభ్యుడు వనమాలి విజయ్‌కుమార్‌, కొల్లు గోపాలకృష్ణ, మైలా వీర్రాజు, పెమ్మాడి నాంచారయ్య, మైలా శ్రీను, నాంచారమ్మ, ఘంటసాల పార్వతి, శ్రీను తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

పెనమలూరు: చౌక దుకాణాల ద్వారా పారదర్శకంగా నిత్యావసర సరుకుల పంపిణీకి స్మార్ట్‌ రేషన్‌కార్డులు ఉపయోగపడతాయని పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. పోరంకిలో సోమవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సౌరభ్‌గౌర్‌, జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మలతో కలిసి స్మార్ట్‌ రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. మంత్రి మనోహర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా కోటీ 46 లక్షల గృహాలకు 4.42 కోట్ల స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్డులో ఉన్న క్యూ ఆర్‌కోడ్‌ను స్కాన్‌ చేస్తే కార్డు దారుడు తీసు కున్నసరుకుల వివరాలు ఫోన్‌కి వస్తాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడెప్రసాద్‌, డీఎస్‌ఓ మోహన్‌బాబు, ఆర్డీవో బీఎస్‌ హేలాషారోన్‌, తహసీల్దార్‌ గోపాలకృష్ణ పాల్గొన్నారు.

అక్రమాలు అరికట్టేందుకు..

గుణదల(విజయవాడ తూర్పు): రింగ్‌ రోడ్డు సమీపంలోని వరలక్ష్మీనగర్‌లో సోమవారం స్మార్ట్‌ రైస్‌ కార్డుల పంపిణీ జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ రేషన్‌ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఈ స్మార్ట్‌ కార్డులు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక సాంకేతి కత అందుబాటులోకి వచ్చిన తర్వాత నగదు లావా దేవీలు ఎంత సులువుగా మారాయో.. నేరాలు అలాగే పెరిగాయి. సైబర్‌ నేరస్తులు దుబాయిలో కూర్చుని ఇక్కడి వారి బ్యాంక్‌ ఖాతాల్లో సొమ్మంతా దోచేస్తారు. ఈ నేరగాళ్లు ఏ రూపంలో వస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. చిన్న పొరపాటుతో నిమిషాల వ్యవధిలో బ్యాంక్‌ ఖాతాలోని సొమ్మంతా ఆన్‌లైన్‌ దొంగలు ఊడ్చేస్తారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినా వారు కోల్పోయిన మొత్తాన్ని సీజ్‌ చేయడం కూడా కుదరని పరిస్థితి ఉంటుంది. సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి మోసాలు నిత్య కృత్యంగా మారాయి. లోన్‌ యాప్‌ల వేధింపులు, సైబర్‌ మోసాలకు గురైన వారు విజయవాలోని సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌కు క్యూ కడుతున్నారు.

రూ.250 కోట్లు దోచేసిన బెజవాడ వాసి

విజయవాడకు చెందిన వడ్డేవల్లి లలిత శరణ్‌కుమార్‌ను సైబర్‌ నేరం కేసులో హైదరాబాద్‌ పోలీసులు రెండు రోజుల కిందట అరెస్టు చేశారు. అతను కొందరు ఏజెంట్ల ద్వారా పలు బ్యాంకుల్లో కరెంట్‌ అకౌంట్లు సృష్టించి వందలాది ఫేక్‌ క్రైమ్‌ లింక్స్‌తో సైబర్‌ నేరాలకు పాల్పడ్డాడు. దుబాయ్‌లో ఉంటూ ఇక్కడ ఏజెంట్ల ద్వారా క్రైమ్‌ లింక్స్‌ను ఆపరేట్‌ చేస్తూ రెండు నెలల వ్యవధిలో దాదాపు రూ.250 కోట్లు దోచేశాడు. ఈ కేసులో శరణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా వందలాది క్రైమ్‌లింక్స్‌ ద్వారా ఆ మొత్తాన్ని పలు కరెంటు అకౌంట్స్‌లోకి బదిలీ చేసినట్లు గుర్తించారు. ఒక రోజు వాడిన అకౌంట్‌ మరో రోజు వాడకుండా ఏజెంట్లకు కమీషన్ల ఆశచూపి వేర్వేరు బ్యాంకుల్లో కరెంటు అకౌంట్స్‌ ఓపెన్‌ చేస్తూ మోసాలకు పాల్పడ్డాడు. అతను విజయవాడలో కూడా నేరాలకు పాల్పడ్డాడా అని పోలీసులు పరిశీలిస్తున్నారు.

7

రూ.793.21 కోట్లతో

పది పనులకు టెండరు నోటీసు

ఇందులో మూడు సేవలు,

ఏడు నిర్మాణ, నిర్వహణ పనులు

రూ.683.33 కోట్లతో రాజధానిలో

సమ్మిళిత పనులు

రూ.109.88 కోట్లతో విజయవాడ,

గుంటూరులో 4 రోడ్ల నిర్మాణాలు

గుంటూరు ఐఆర్‌ఆర్‌ పనికి

ఆరు టెండర్లు దాఖలు

ఫైనాన్షియల్‌ బిడ్‌ ఓపెన్‌కు

మీనమేషాలు

విజయవాడలో మూడు పనులకు

మూడు వాయిదాలు

ఏపీసీఆర్‌డీఏ టెండర్లలో

తిరకాసులెన్నెన్నో...

చిలకలపూడి(మచిలీపట్నం): ఈవీఎం గోదా మును కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ సోమ వారం తనిఖీ చేశారు. ఎన్నికల విభాగం సూపరింటెండెండ్‌ శ్యామ్‌నాథ్‌ పాల్గొన్నారు.

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఏపీ సీఆర్‌డీఏ ఆహ్వానించిన టెండర్లను నిర్ణీత సమయంలో తెరవకుండా మీనమేషాలు లెక్కిస్తూ తమకు అనుకూలురైన కాంట్రాక్టర్ల కోసం ఎదురుచూస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్‌కు బిడ్లు దాఖలైనప్పటికీ సహేతుక కారణాలేవీ లేకుండానే ఫైనాన్షియల్‌ బిడ్‌ తెరవకుండా వాయిదా వేస్తుండగా, కొన్ని టెండర్లకు సంబంధించి సాంకేతిక బిడ్‌లను కూడా ఓపెన్‌ చేయడంలేదని టెండరుదారులు తీవ్రారోపణలు చేస్తున్నారు. తమకు అనుకూలురైన బడా కాంట్రాక్టర్లకు టెండర్లను కట్టబెట్టడానికే వాయిదాల వ్యవహారాలను ఏపీసీఆర్‌డీఏ ఉన్నతాధికారుల ద్వారా కూటమిలోని పెద్దలు కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లను పక్కన పెట్టి అన్ని పనులను ఒకటిగా చేసి పెద్దమొత్తంతో టెండరు పిలిచి బడా కంపెనీలకు అప్పజెప్పి భారీస్థాయిలో పర్సంటేజీలు రాబట్టుకోవచ్చనే వ్యూహంలో భాగంగానే వాయిదాలపర్వమని స్పష్టమవుతోంది.

అమరావతి రాజధానిలో, విజయవాడ, గుంటూరు నగరాల్లో పది పనులకు ఏపీసీఆర్‌డీఏ రూ.793.22 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. ఏడు నిర్మాణ, నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉండగా తక్కిన మూడు టెండర్లు సేవలకు సంబంధించినవి. నిర్మాణ, నిర్వహణ పనులకు గాను టెండరు డాక్యుమెంట్లను జూలై 11 నుంచి ఆగస్టు 8వ తేదీ లోగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. నిర్దేశిత బిడ్లకు ఆగస్టు ఒకటి నుంచి 13వ తేదీలోగా టెండర్లు దాఖలు చేయడానికి గడువు విధించింది.

గుంటూరు జేకేసీ కాలేజీ మార్గంలోని స్వర్ణభారతి నగర్‌ వద్ద నుంచి పెద్దపలకలూరు వరకు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు మూడో ఫేజ్‌ కింద నిర్మాణానికి రూ.34,87,28,545 టెండరు పిలిచింది. ఆగస్టు ఏడో తేదీ టెండరు దాఖలుకు గడువిచ్చింది. టెక్ని కల్‌ బిడ్డు తెరవగా ఆరు టెండర్లు దాఖలైనట్లు గుర్తించారు. టెండరు నిబంధనల ప్రకారం 8వ తేదీ ఫైనాన్షియల్‌ బిడ్‌ను తెరవాలి. ఇప్పటివరకు ఆ పనిచేయలేదు. కారణాలేంటని పలుసార్లు సంబంధిత అధికారులను సంప్రదించినా సమాచారం ఇవ్వడంలేదని టెండరుదారులు ‘సాక్షి’కి తెలిపారు.

విజయవాడ నగరంలోని బల్లెంవారివీధి జంక్షన్‌ నుంచి నిడమానూరు మెయిన్‌ రోడ్డు జంక్షన్‌ వరకు (హెచ్‌టీ లైన్‌ రోడ్‌) బీటీ హాట్‌ మిక్స్‌తో రోడ్డు విస్తరణ, సెంట్రల్‌ డివైడర్‌ తదితర పనులకు రూ.26,51,89,656 టెండరు ఆహ్వానించింది. అదేవిధంగా మహానాడు రోడ్డు నుంచి బల్లెంవారివీధి నుంచి పోరంకి, నిడమానూరు రోడ్డు విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌, ఇతర పనులకు రూ.25,52,45,567 మరో టెండర్‌ను పిలిచింది. బందరు రోడ్డు నుంచి హెచ్‌టీ లైన్‌ జంక్షన్‌ వరకు బల్లెంవారివీధి రోడ్డు విస్తరణ, సెంట్రల్‌ డివైడర్‌, లైటింగ్‌ పనుల నిమిత్తం 22,96,21,066 టెండరు ఆహ్వానించింది. పై మూడు పనులకు సంబంధించి ఆగస్టు 11వ తేదీ టెక్నికల్‌ బిడ్‌ తెరవనున్నట్లు టెండరులో పేర్కొన్నప్పటికీ ఆ మేరకు చేయలేదు. ఏ కారణం చెప్పకుండానే 19వ తేదీ టెక్నికల్‌ బిడ్‌ ఓపెన్‌ చేస్తున్నట్లు చెప్పిన అధికారులు అలా చేయకపోగా మరోసారి ఈ నెల 29వ తేదీకి వాయిదా వేయడం పరిశీలనాంశం. మూడు పనులకు సంబంధించిన టెక్నికల్‌ బిడ్‌ను ఓపెన్‌ చేయకుండా మూడు పర్యాయాలు ఎందుకు వాయిదా వేశార నేది అంతుబట్టని అంశంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఫైనాన్షియల్‌ బిడ్‌ ఓపెన్‌ చేయకపోవడం, విజయవాడలోని మూడు పనుల టెండర్లను ఇలా వాయిదాలు వేయడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోందని అంటున్నారు. బడా గుత్తేదారులకు పనులు అప్పగించాలనే వ్యూహంతో ఉన్నప్పుడు ఏపీ సీఆర్‌డీఏ టెండర్లు పిలవడం ఎందుకని నిలదీస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

టెండర్ల వాయిదాల పర్వం 1
1/7

టెండర్ల వాయిదాల పర్వం

టెండర్ల వాయిదాల పర్వం 2
2/7

టెండర్ల వాయిదాల పర్వం

టెండర్ల వాయిదాల పర్వం 3
3/7

టెండర్ల వాయిదాల పర్వం

టెండర్ల వాయిదాల పర్వం 4
4/7

టెండర్ల వాయిదాల పర్వం

టెండర్ల వాయిదాల పర్వం 5
5/7

టెండర్ల వాయిదాల పర్వం

టెండర్ల వాయిదాల పర్వం 6
6/7

టెండర్ల వాయిదాల పర్వం

టెండర్ల వాయిదాల పర్వం 7
7/7

టెండర్ల వాయిదాల పర్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement