
పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు తెలపండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో కొత్తగా ప్రతిపాదిస్తున్న పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని కలెక్టర్ డి.కె.బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్ సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 72 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. 30 పోలింగ్ కేంద్రాల ప్రదేశాలను మార్పు కోసం ప్రతిపాదించా మన్నారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా రాజకీయ పార్టీల తరఫున బూత్‌స్థాయి ఏజెంట్లను తప్పనిసరిగా నియమించాలన్నారు. సమావేశంలో డీఆర్వో చంద్రశేఖరరావు, ఆర్డీఓలు కె.స్వాతి, బాలసుబ్రహ్మణ్యం, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, పార్టీల ప్రతినిధులు మేకల సుబ్బన్న, బాలాజీ, కొడాలి శర్మ, అధికారులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ