
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను అందజేశారు. గుంటూరు పాతపేటకు చెందిన కనూరు రత్నాకరరావు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. రత్నాకరరావు తమ కుటుంబ సభ్యుల పేరిట అన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు.
ఉచిత ప్రసాద వితరణకు రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రిపై ఉచిత ప్రసాద వితరణకు హైదరాబాద్‌కు చెందిన కత్తుంగ వీర వెంకట సత్యనారాయణ, అంజనాదేవిలు తమ కుమారుడు ఆర్యన్ పేరిట రూ. 1,01,116ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఏఈవో ఎన్.రమేష్‌బాబు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను ఇచ్చారు.