
గుర్తుతెలియని వ్యక్తి మృతి
పటమట(విజయవాడతూర్పు): గుర్తుతెలియని, మతి స్థిమితం లేని వ్యక్తి మృతి చెందిన ఘటన పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మంగళ వారం ఉదయం రామచంద్రనగర్ రోడ్డులో సుమారు 40 ఏళ్ల వ్యక్తి తాను చనిపోతానని బెదిరిస్తూ లారీలకు అడ్డం పడ్డాడు. ఆటోనగర్ నుంచి మహానాడు రోడ్డువైపు వస్తున్న లారీ కింద పడ్డాడు. గాయపడిన అతడిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం ఉదయం మృతి చెందాడు. అతని మృతదేమాన్ని ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పటమట పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ పవన్ కిషోర్ కోరారు.