ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) నందు పనిచేస్తున్న ఆర్పీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ)డిమాండ్ చేసింది. సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ నందు ఏపీ మెప్మా ఆర్పీల సంఘం ఆధ్వర్యంలో ఆర్పీలకు మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, వేతనాలు పెంచాలని, వేతనాలకు పనికి ముడిపెట్టకుండా గ్రేడింగ్ విధానం రద్దుచేసి పదివేల రూపాయల వేతనం ప్రభుత్వమే చెల్లించాలి వంటి డిమాండ్ల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో ఆర్పీలు పాల్గొని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. అనంతరం మెప్మా అధికారులు ఆర్పీల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు ముజఫర్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.