దేవినేని అవినాష్
గుణదల(విజయవాడ తూర్పు): ప్రజాక్షేత్రంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్ విమర్శించారు. గుణదలలోని ఆయన కార్యాలయంలో ఆదివారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ప్రభుత్వ డొల్లతనం బయటపడిందని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అన్ని వర్గాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సీపీ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ చేస్తున్న అరాచకాలను నేతలు, కార్యకర్తలు నిలదీయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ కార్యాచరణ పై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు కలపాల అంబేద్కర్, వియ్యపు అమర్నాఽథ్, తంగిరాల రామిరెడ్డి, భీమిశెట్టి ప్రవల్లిక, తదితరులు పాల్గొన్నారు.