హ్యాండ్‌బాల్‌ రాష్ట్ర విజేత పశ్చిమగోదావరి | - | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బాల్‌ రాష్ట్ర విజేత పశ్చిమగోదావరి

Mar 22 2025 2:00 AM | Updated on Mar 22 2025 1:56 AM

విజయవాడస్పోర్ట్స్‌: రాష్ట్ర స్థాయి అండర్‌–19 జూనియర్‌ బాలికల హ్యాండ్‌బాల్‌ పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా సత్తా చాటింది. ఈ నెల 20వ తేదీన విజయవాడలోని ఆంధ్రా లయోల కాలేజీలో ప్రారంభమైన ఈ పోటీలకు 12 ఉమ్మడి జిల్లాలు ప్రాతినిధ్యం వహించారు. లీగ్‌ కం నాకౌట్‌ పద్ధతిలో జరిగిన ఈ పోటీల్లో పశ్చిమగోదావరి జట్టు వరుస విజయాలను సాధించింది.

శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో ప్రత్యర్థి తూర్పుగోదావరి జిల్లా జట్టును ఓడించి విన్నర్‌ ట్రోఫీని అందుకుంది. తూర్పు గోదావరి జిల్లా రన్నర్‌ ట్రోఫీని అందుకుంది. మూడో స్థానం కోసం కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు తలపడ్డాయి. ఈ పోటీల్లో కృష్ణాజిల్లా జట్టు విజయం సాధించి తృతీయ బహుమతిని అందుకుంది. విజేతలకు ఆంధ్రప్రదేశ్‌ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మల్లేశ్వరరావు, లయోల కాలేజీ వ్యాయామ విద్యా విభాగాధిపతి డాక్టర్‌ కె.సుజాత ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో హ్యాండ్‌బాల్‌ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెనుమత్స సత్యనారాయణరాజు, కృష్ణాజిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం కార్యదర్శి ఎన్‌.వంశీకృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.

రన్నరప్‌గా తూర్పు గోదావరి,

కృష్ణా జిల్లాకు మూడో స్థానం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement