కేసీఆర్ జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: యూకే ఎన్నారైలు

United Kingdom Nri Welcomes Kcr Plans To Launch National Party Decision - Sakshi

లండన్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని యూకే ఎన్నారైలు ఆకాంక్షించారు. నూతన జాతీయ పార్టీ స్థాపించాలన్న ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద సమావేశమైన ఎన్నారైలు కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. యూకేలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు సైతం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని, భారత దేశానికి నాయకత్వం వహించి దేశ గతిని మార్చాలని కోరారు. 

ప్రస్తుతం దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తుందని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధి దేశమంతా జరగాలంటే ఆయన వల్లే సాధ్యమని ఎన్నారైలు తెలిపారు. "దేశ్ కి నేత కేసీఆర్" అంటూ భారీ కేసీఆర్‌ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలంతో పాటు ఎన్నారైలు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top