యూఏఈ గోల్డెన్‌ వీసా.. మన ఆర్టిస్ట్‌కు!

UAE Golden Visa Recieved By Odisha Based Artist Mona Biswarupa Mohanty - Sakshi

న్యూఢిల్లీ: ఒడిషాకు చెందిన ఆర్టిస్ట్‌ మోనా విశ్వరూప మోహంతీకి అరుదైన అవకాశం దక్కింది. యూఏఈ ప్రభుత్వం అందిస్తున్న గోల్డెన్‌ వీసా ఆమెకి దక్కింది. గోల్డెన్‌ వీసా ప్రకారం.. ఎవరైనా సరే పదేళ్లపాటు అక్కడ నిరభ్యరంతంగా ఉండొచ్చు. అంతేకాదు వీసా దానికదే రెన్యువల్‌ అవుతూ ఉంటుంది. 

కళలు, క్రియేటివిటీ పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్‌, విద్య,  వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ ప్రభుత్వం ఈ వీసా అందిస్తుంది. ఈ వీసా వల్ల అక్కడ ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా ఉండొచ్చు, పని చేసుకోవచ్చు, చదువుకునే అవకాశం కూడా ఉంటుంది. పైగా స్వదేశం నుంచి ఎలాంటి స్పాన్సర్‌షిప్‌ అక్కర్లేదు. అంతేకాదు అక్కడ చేసుకునే వ్యాపారాలకు వంద శాతం హక్కులు ఉంటాయి. 

కాగా, యూఏఈ 2019 నుంచి కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ఐదు నుంచి పదేళ్ల మధ్య గోల్డెన్‌ వీసా ఇస్తారు. ఇది ఆటోమేటిక్‌గా రెన్యువల్‌ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ ఘనత దక్కించుకున్న తొలి ఒడిషా పర్సన్‌గా మోనా విశ్వరూప నిలిచింది. మయూర్‌భంజ్‌ జిల్లా పుట్టిన ఆమె 2007 నుంచి దుబాయ్‌లో ఉంటోంది. ఫ్యాషన్‌ కెరీర్‌ను వదిలేసుకుని.. డిజైన్‌ ఇండస్రీ‍్టలో ఎనిమిదేళ్లుగా పని చేస్తోంది. దుబాయ్‌ ఎకనామిక్‌ డిపార్ట్‌మెంట్‌లో ఆమె సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌​ ప్రాక్టీషనర్‌గా రిజిస్ట్రర్‌ చేసుకుంది. కాగా, తనకు దక్కిన గౌరవంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ.. భారత సంప్రదాయాలకు మరింత గుర్తింపు కోసం ప్రయత్నిస్తానని చెబుతోంది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top