ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 18 వేల మంది భారతీయులు ?హెల్ప్ లైన్ నంబర్లు

IMPORTANT ADVISORY TO ALL INDIAN NATIONALS IN UKRAINE AS ON 24 FEBRUARY 2022 - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న ఇండియన్లను ఎక్కడివార్కడే ఆగిపోవాలంటూ తెలిపింది. సురక్షిత ప్రాంతాలకు చేరుకుని ఆ దేశంలో పరిస్థితులు చక్కబడే వరకు వేచి ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌ పశ్చిమ ప్రాంతాల నుంచి ఆ దేశ రాజధాని కీవ్‌ వచ్చేందుకు ప్రయత్నిస్తున్న భారతీయులంతా తిరిగి తమ తమ ప్రదేశాలకు వెళ్లిపోవాలని కోరింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సూచనలే పాటించాలని కోరింది. ఉక్రెయిన్‌ క్రైసిస్‌ నేపథ్యంలో విదేశాంగ శాఖ ఇప్పటికే హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రకటించింది.

ఇంకా 18 వేల మంది..
ఉక్రెయిన్‌ వివాదం తెరపైకి రాకముందు ఆ దేశంలో 22 వేల మంది భారతీయులు ఉన్నట్టుగా అధికార వర్గాలు అంచనా వేశాయి. ఇందులో సుమారు వెయ్యి మంది వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఉద్రిక్తలు ప్రారంభం కాగానే చాలా మంది స్వదేశం బాట పట్టారు. మరికొందరు తాము చదువుతున్న యూనివర్సిటీల నుంచి సెలవు/ఆన్‌లైన్‌ క్లాసులకు సంబంధించి అధికారిక సమాచారం రాకపోవడంతో అక్కడే ఉండిపోయారు. . ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం ఉక్రెయిన్‌లో ఇంకా 18 వేల మంది వరకు ఇండియన్లు ఉండవచ్చని అంచనా.

ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు
ఏపిఎన్ఆర్టీసిఈఓ దినేష్  9848460046
నోడల్ ఆఫీసర్ రవిశంకర్ 9871999055
గీతేష్ శర్మ, స్పెషల్ ఆఫీసర్ 7531904820

ఎయిర్‌ స్పేస్‌ క్లోజ్‌
పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 21 నుంచి ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమనాలు పంపారు. ప్రతీ విమానంలో రెండు వందల మంది వంతున ప్రయాణికులు ఇండియాకు గత రెండు రోజుల్లో చేరుకున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 27న మూడు విమానాలు కీవ్‌ నుంచి న్యూఢిల్లి రావాల్సి ఉంది. కానీ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఎయిర్‌ స్పేస్‌ మూసేయడంతో విమాన సర్వీసులు రద్దయినట్టే లెక్క. 

వెస్ట్‌ సేఫ్‌
స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఉక్రెయిన్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చే వారిని ఎక్కడి వారు అక్కడే ఉండి పోవాలంటూ భారత ప్రభుత్వం కోరింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో కొంత మేరకు సేఫ్‌గా ఉన్న పశ్చిమ ప్రాంతాల వారిని తిరిగి అదే ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. 

ఉక్రెయిన్ ఎంబసీ వద్ద భారతీయుల పడి గాపులు
రష్యా యుద్ధం ప్రకటించడంతో  ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులపై ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని క్షేమంగా స్వదేశానికి తిరిగి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఆర్మీ విమానాలు పంపాలి
ఉద్రిక్తలు మొదలవగానే ఇండియా వచ్చేందుకు మా తమ్ముడు ప్రయత్నించాడని కానీ విమాన ఛార్జీలు లక్షల్లో వసూలు చేస్తుండటంతో అక్కడే ఉండి పోయాడని డాక్టర్‌ పూజా అన్నారు. ప్రస్తుతం పౌర విమానాలకు రాకపోకలు నిషేధించిన  నేపథ్యంలో మిలిటరీ విమానాలు పంపి భారతీయులను తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top