నిర్మల్‌ జిల్లా బీజేవైఎం ఇన్‌చార్జిగా విజయ్‌కృష్ణ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ జిల్లా బీజేవైఎం ఇన్‌చార్జిగా విజయ్‌కృష్ణ

Sep 18 2026 2:33 AM | Updated on Sep 18 2026 2:33 AM

నిర్మల్‌ జిల్లా బీజేవైఎం ఇన్‌చార్జిగా విజయ్‌కృష్ణ అధికారులు అందుబాటులో ఉండాలి జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌కు ఎంపిక రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

సుభాష్‌నగర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు బీజేవైఎం జిల్లా ఇన్‌చార్జులను ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రానికి చెందిన బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కో–కోశాధికారి అమంద్‌ విజయ్‌ కృష్ణను నిర్మల్‌ జిల్లా బీజేవైఎం ఇన్‌చార్జిగా నియమించారు. అమంద్‌ విజయ్‌ కృష్ణ గతంలో బీజేవైఎంలో వివిధ బాధ్యతలను నిర్వహిస్తూ, నిరంతరం ప్రజా సమస్యలపై, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు నిర్వహించారు. విజయ్‌ కృష్ణ మాట్లాడుతూ... తనను నిర్మల్‌ జిల్లా బీజేవైఎం ఇన్‌చార్జిగా నియమించడం సంతోషంగా ఉందని, బీజేవైఎంను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్మూర్‌టౌన్‌: గణేశ్‌ నిమజ్జనం అయ్యే వరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ నిమజ్జనం ప్రశాంతం జరిగేలా చూడాలని ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియ అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని గుండ్ల చెరువును అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. మూడో రోజు నుంచి వినాయక నిమజ్జనం భక్తులు చేస్తుంటారని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్‌, వైద్యం, మున్సిపల్‌, రెవన్యూ అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తుండాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ సత్యనారాయణ, ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, విద్యుత్‌ డీఈ రఘు, వివిధ శాఖ అధికారులు ఉన్నారు.

వేల్పూర్‌(బాల్కొండ): బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి హైస్కూలు విద్యార్థి శ్రీనిత్‌ జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌కు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ విజయ్‌ కర్తన్‌ తెలిపారు. మండల స్థాయిలో ప్రథమస్థానం పొందిన శ్రీనిత్‌కు గురువారం మండల విద్యావనరుల కేంద్రంలో ఎంఈవో కృష్ణవేణి సర్టిఫికెట్‌ అందించి అభినందించారు. త్వరలో జిల్లా కేంద్రంలో నిర్వహించే జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌లో ప్రతిభ చూపి, రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్కూలు డైరెక్టర్లు విఘ్నేశ్వర్‌, ఆకు లక్ష్మణ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సిరికొండ: తెలంగాణ సాఫ్ట్‌ బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ అండర్‌–15 సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలకు సిరికొండ సత్యశోధక్‌ పాఠశాల విద్యార్థిని ఎ. యుగేశ్వరి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ ఆర్‌ నర్సయ్య తెలిపారు. ఈ నెల 18 నుంచి 20 వరకు కమ్మర్‌పల్లిలో నిర్వహించే పోటీల్లో విద్యార్థిని పాల్గొంటుందని ఆయన తెలిపారు. విద్యార్థినికి పాఠశాలలో గురువారం ప్రత్యేక జ్ఞాపిక అందజేసి ప్రిన్సిపాల్‌ అభినందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement