ఏకచక్రేశ్వరాలయంలో ఆశీర్వాద దీపం | - | Sakshi
Sakshi News home page

ఏకచక్రేశ్వరాలయంలో ఆశీర్వాద దీపం

Sep 18 2026 2:33 AM | Updated on Sep 18 2026 2:33 AM

ఏకచక్రేశ్వరాలయంలో ఆశీర్వాద దీపం

బోధన్‌: పీఎం నరేంద్రమోదీ జన్మదినం, 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానానికి కృతజ్ఞత తెలిపేందుకు ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించినట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి పట్టణ కేంద్రంలోని ఏకచక్రేశ్వరాలయంలో ఆయన, స్థానిక నాయకులతో కలిసి ఆశీర్వాద దీపం వెలిగించారు. మోదీ వివిధ బాధ్యతలను నిర్వహిస్తూ దేశ సేవకు అంకితమయ్యారని తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపి కిషన్‌, నాయకులు కోలా ఇంద్రకరణ్‌, సుధాకర్‌ చారి, కొలిపాక బాలరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement