గుర్తు తెలియని మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Sep 18 2026 2:33 AM | Updated on Sep 18 2026 2:33 AM

గుర్తు తెలియని మృతదేహం లభ్యం ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి చెరువులో పడి ఒకరు.. జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య కల్లు దుకాణాలపై దాడులు

వేల్పూర్‌(ముప్కాల్‌): ముప్కాల్‌ మండల పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై కిరణ్‌పాల్‌ గురువారం తెలిపారు. మృతుడి వయస్సు 55 ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో ప్రధాన రోడ్డుపై గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి(50) మృతి చెందినట్లు ఒకటవ టౌన్‌ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. బస్సు ముందు చక్రాలు వ్యక్తి కాళ్లపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

జక్రాన్‌పల్లి: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నిజాంపురం సాయన్న(58) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఎస్సై మహేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయన్న ఇతర కాపరులతో కలిసి బుధవారం సుమారు వంద గేదెలను మేత కోసం ఊరి చివర ఉన్న అప్పల చెరువు వద్దకు తీసుకెళ్లారు. మధ్యాహ్నం సమయంలో చెరువులో ఉన్న గేదెలను బయటకు తోలడానికి సాయన్న చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఆయన కుమారుడు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహమ్మద్‌నగర్‌ మండలం ముగ్దుంపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆదాం భానుప్రసాద్‌(44) గ్రామంలో పనులు చేస్తు జీవిస్తున్నాడు. అతని భార్య ఏడేళ్ల క్రితం మృతి చెందింది. నాటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న భాను ప్రసాద్‌ జీవితంపై విరక్తితో గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

బోధన్‌: మండలంలోని ఊట్‌పల్లిలో ఉన్న కల్లు దుకాణాలపై బోధన్‌ ఎకై ్సజ్‌ సీఐ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, సిబ్బంది గురువారం దాడులు నిర్వహించారు. అనుమతి లేని కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తుడు సంతోష్‌కుమార్‌ జిల్లా ఎకై ్సజ్‌ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు మేరకు దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామంలోని ఏడు కల్లు దుకాణాల పై దాడులు చేసి తనిఖీలు చేశారు. ఇందులో ఓ దుకాణానికి అనుమతి లేనందున సీజ్‌ చేసి, 30 లీటర్ల కల్లును ధ్వంసం చేశారు. దుకాణ నిర్వాహకుడి పై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ తెలిపారు. ఎస్సై జీవన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement