త్వరలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు | - | Sakshi
Sakshi News home page

త్వరలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు

Sep 18 2026 2:33 AM | Updated on Sep 18 2026 2:33 AM

త్వరలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు

వేల్పూర్‌: మండలంలోని వాడి గ్రామానికి మంజూరైన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ సుంకెట అన్వేష్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన వాడి గ్రామంలో సబ్‌స్టేషన్‌ నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించారు. సబ్‌స్టేషన్‌ టెండరు పొందిన కాంట్రాక్టరుతో మాట్లాడారు. పనులు ప్రారంభించకపోవడంపై అడిగారు. సబ్‌స్టేషన్‌ స్థలంలో నీరున్నందున పనులకు ఇబ్బంది అవుతుందని, నెలరోజుల్లో పనులు మొదలు పెడుతామని చెప్పారు. ఆయన వెంట సర్పంచ్‌ గోలి లింబాద్రి, కాంగ్రెస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు మహేందర్‌, అంకం రమేశ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement