బాల్కొండ సీహెచ్‌సీలో పూర్తిస్థాయి వైద్యసేవలు | - | Sakshi
Sakshi News home page

బాల్కొండ సీహెచ్‌సీలో పూర్తిస్థాయి వైద్యసేవలు

Sep 18 2026 2:33 AM | Updated on Sep 18 2026 2:33 AM

వేల్పూర్‌(బాల్కొండ) : బాల్కొండ కమ్యూ నిటీ హెల్త్‌ సెంటర్‌లో త్వరలో పూర్తిస్థాయి వైద్యసేవలు అందించనున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త శ్రీనివాస్‌ప్రసాద్‌ పే ర్కొన్నారు. బాల్కొండ సీహెచ్‌సీని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ విజయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ అరవింద్‌తో కలిసి గురువారం శ్రీని వాస్‌ప్రసాద్‌ సందర్శించారు. ఆస్పత్రిలో ఉ న్న సౌకర్యాలు, ఎక్విప్‌మెంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి జనరల్‌ ఫిజిషియన్‌, సర్జన్‌, సీ్త్ర వైద్య నిపుణులు, చిన్నపిల్లల వైద్యుడు, దంత వైద్యుడిని నియమించామన్నారు. అ లాగే పోస్టుమార్టం సేవలను దసరా నాటికి పునరుద్ధరిస్తామన్నారు. పోస్టుమార్టం కోసం అవసరమైన మరమ్మతులను ఆస్పత్రి ఆవర ణలో చేయించేందకు సర్పంచ్‌ రాజేశ్‌ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రెండు వారాల త ర్వాత తిరిగి ఆస్పత్రిని పరిశీలిస్తామన్నారు. వైద్యులు వినీశా, రవళి, వినోద్‌, సతీశ్‌, నవ నీత్‌, బాల్కొండ సర్పంచ్‌ గాండ్ల రాజేశ్‌, ఉపసర్పంచ్‌ గాండ్ల రాజేందర్‌, వార్డు సభ్యుడు సందీప్‌, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement