బాలికలు బలవుతున్నారు! | - | Sakshi
Sakshi News home page

బాలికలు బలవుతున్నారు!

May 29 2026 2:37 AM | Updated on May 29 2026 2:37 AM

నిందితులపై కఠిన చర్యలు కారణాలు అనేకం

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

డేంజర్‌ వెల్స్‌

సిరికొండ మండలంలోని వివిధ మార్గాల్లో వ్యవసాయ బావులు ప్రమాదకరంగా ఉన్నాయి.

శుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026

– 8లో u

నిజామాబాద్‌అర్బన్‌ : జిల్లాలో బాలికలపై లైంగిక దాడులు, మైనర్ల వివాహాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి యేటా పోక్సో కేసులు పెరుగుతున్నాయి. చట్టం అందుబాటులో ఉన్నా, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆగడాలు మాత్రం ఆగడం లేదు. బాలికలపై లైంగిక వేధింపుల కారణంగా విద్యాసంస్థల్లో పోక్సో కేసులు నమోదవుతున్నాయి. విద్యాబోధన చేసే గురువులే కొన్ని చోట్ల ఈ ఘాతుకాలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. వసతి గృహాలలో సైతం బాలికలకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. తరచూ ఈ కేంద్రాలలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలో ఇటీవల పలు కేసులు నమోదయ్యాయి.

సోషల్‌ మీడియా ప్రభావం

స్మార్ట్‌ఫోన్‌, సోషల్‌ మీడియా ప్రభావంతో కొందరు లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు మానసిక వైద్యులు చెబుతున్నారు. వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు. సోషల్‌ మీడియాలో లైంగిక వేధింపులు, అశ్లీల చిత్రాలు, గంజాయి సీన్లూ చూస్తూ ప్రభావితమై యువత మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్నారని, ఈ క్రమంలో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు నమోదవుతున్న కేసుల ద్వారా తెలుస్తోంది.

మైనర్లపై లైంగిక దాడుల నివారణకు పోలీసు శాఖ అనే క కార్యక్రమాలతో అవగహన కల్పిస్తోంది. షీటిమ్‌లు ప్రతి విద్యా సంస్థల్లో అవగ హన కల్పిస్తు న్నాయి. ముఖ్యంగా సాంకేతిక విధానంలో కూడ ప్రచారం చేస్తున్నాం. ఇ లాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

– పి సాయి చైతన్య, పోలీసు కమిషనర్‌, నిజామాబాద్‌

బాలికలపై లైంగిక వేధింపులకు అనేక కారణాలు ఉన్నాయి. మైనర్‌ పై అత్యాచారాలకు ఆశ్లీలత పెరిగి పోవడం కూడా కారణం. మైనర్లకు తినుబండారాల ఆశ చూపి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. అవగాహన కూడ లేక పోవడం ఓ కారణం. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

–డాక్టర్‌ విశాల్‌, మానసిక వైద్య నిపుణులు

కొన్ని ఘటనలు..

గతేడాది నగరంలోని పెయింటర్స్‌ కాలనీలో ఓ దివ్యాంగుడు ఇద్దరు మైనర్‌ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

గతంలో నందిపేట మండలంలోని ఓ గ్రామంలో మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిపై స్థానికులు దాడి చేయగా మరణించాడు. బోధన్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు.

ఆరో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు రోజుల క్రితం ఓ బాలిక తన ఇంటికి వెళ్తుండగా ఓ వ్యక్తి చాక్లెట్‌ కొనిస్తానని ఆశ చూపి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగికంగా ఇబ్బందులకు గురిచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు

ఇటీవల నగరంలోని ఆరోటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మైనర్‌ బాలికకు ఆధార్‌ కార్డులో వయస్సును ఎక్కువగా నమోదు చేయించి ఓ ఖాజీకి పెళ్లి చేశారు. స్థానికుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆధార్‌ కార్డులో వయస్సు మార్పిడి చేసిన సెంటర్‌ యజమాని, బాలిక తల్లిదండ్రులు, మరికొందరిపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

ఒకటో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు రోజుల క్రితం మాలపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల దుబాయ్‌ నుంచి ఇంటికి వచ్చాడు. తన భార్యకు విడాకులు ఇచ్చి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పెళ్లి చేసుకున్నాడు, స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఆందోళన కలిగిస్తున్న మైనర్లపై

లైంగిక దాడులు

ప్రతి ఎటా పోక్సో కేసుల పెరుగుదల

కేసుల నివారణకు అవగాహన

కల్పిస్తున్న పోలీసు శాఖ

పాఠశాలల్లో షీ టీమ్‌ల

ఏర్పాటు

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి :

మానసిక వైద్యుల సూచనలు

Advertisement
 
Advertisement
Advertisement