మౌలిక వసతులు ఏర్పాటు
● జిల్లాలో 112 పాఠశాలలు ఎంపిక
● పీఎంశ్రీ కింద ఇప్పటికే
ఐదు బడుల్లో అమలు
● ప్రభుత్వ బడుల బలోపేతానికి ఊతం
ఖలీల్‌వాడి : ప్రభుత్వ బడులను బలోపేతం చేయ డానికి చర్యలు ప్రారంభమయ్యాయి. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను 2026–27 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించడానికి పాఠశాల శాఖ సి ద్ధం అయింది. తల్లిదండ్రులు తమ పిల్లలను నాలుగేళ్లు పడకముందే ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ స్కూళ్ల లో చేరుస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ చదివిన పిల్లలు అక్కడే పైతరగతులు కూ డా చదవడంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఈ క్రమంలో సర్కారు స్కూళ్లను బ లోపేతం చేయడానికి ప్రీప్రైమరీ ఏర్పాటు చేయాల ని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రు లు విద్యాశాఖ అధికారులకు విన్నవించారు.
ఇప్పటికే జిల్లాలోని 40 పీఎంశ్రీ స్కూళ్లలోని ఐ దింటిలో ప్రైమరీ స్కూళ్లు, 68 పాఠశాలల్లో ప్రీప్రై మరీ నిర్వహించగా, తాజాగా బుధవారం జిల్లాకు మరో 112 ప్రీప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేస్తూ పా ఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతుండగా, నిరుద్యోగులకు సైతం ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఆటపాటలతో కూడిన చదువు..
జిల్లాలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభమవుతు న్న స్కూళ్లలో ప్రత్యేక తరగతి గదులు ఏర్పాటు చే స్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆటపాటలతో కూడిన చదువు, స్లీపింగ్ అవ ర్, మధ్యాహ్న భోజనం అమలు చేస్తారు. వీరికి వి ద్యాబోదన చేసేందుకు ఆయా గ్రామాల్లోనే ఉన్నత చదువు చదివిన వారిని ఎంపిక చేశారు. ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను ఎంపిక చేసి వారికి జీతభత్యాలు చెల్లి స్తారు. మూడేళ్లు పైబడిన పిల్లలను ఎల్‌కేజీ, నాలుగేళ్లు పైబడిన వారిని యూకేజీలో చేర్చుకుంటారు. వీటి నిర్వహణ నిమిత్తం గ్రీన్‌బోర్డులు. ఫ్యాన్లు, ఫ ర్నిచర్ కొనుగోలు, ఇండోర్, ఆవుట్ డోర్ గేమ్స్, ఇతర వాటి కోసం రూ. లక్ష లోపు నిధులు సమకూర్చుతారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఎల్‌కేజీ, యూకేజీ చదివిన పిల్లలకు వచ్చే విద్యా సంవత్స రంలో 1వ తరగతిలో చేరేందుకు అర్హత ఉంటుంది. తద్వారా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పె రిగే అవకాశం ఉంది. మరోవైపు తల్లిదండ్రులకు ఆ ర్థిక భారం తగ్గుతుంది. పిల్లలకు సర్కారు బడుల్లో నే నాణ్యమైన విద్య అందుతుంది. ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం వరకు జిల్లాలోని అన్ని పాఠశాల్లో ప్రీపైమరీ స్కూళ్లను ఏర్పాటు చేయడానికి సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.
(వచ్చే విద్యాసంవత్సరం అన్ని పాఠశాలల్లో
ప్రీప్రైమరీ ఏర్పాటుకు అవకాశం)
జిల్లాలో 112 స్కూళ్లు ప్రీపైమరీకి ఎంపికయ్యాయి. ఆటపాటల ద్వారా బోధన అందుతుంది. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు క ల్పిస్తాం. అవసరమైన ఫర్నిచర్, ఆట వస్తువులు, బోధన సామగ్రి, భద్రత ప్రమాణాలు, విద్యార్థుల ను ఆకర్షించేలా గోడలపై రంగు రంగుల బొమ్మలు, పిల్లలు నిద్రపోయే గదిని ఏర్పాటు చేస్తాం. దీనికి కావాల్సిన సిబ్బందిని నియామిస్తాం.
– బాలకృష్ణ, సెక్టోరియల్ ఆఫీసర్, నిజామాబాద్


