కుట్ర సమాచారంతో తనిఖీలు..
● ఈజీ మనీ కోసం అడ్డదారి..
● నేర కుట్రను భగ్నం చేసిన పోలీసులు
● అక్రమ తుపాకీ, రబ్బర్ బుల్లెట్లు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం : ఆ వ్యాపారి వద్ద అప్పులు తీసుకు న్నారు. వాటిని తీర్చలేక అతడి సంపదపైనే కన్నేశా రు. ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం కిడ్నాప్‌నకు స్కెచ్చేశారు. ఈ కుట్రను పోలీసులు ఛేదించడంతో కథ సుఖాంతమైంది. గురువారం జిల్లా పో లీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
జిల్లా కేంద్రానికి చెందిన బూస శ్రీనివాస్ అనే వ్యాపారవేత్తకు చిట్యాలకు చెందిన నిట్టు నర్సింగరావు, సంతాయిపేట్‌కు చెందిన సూర స్వామి అలియాస్ ఒడ్డె స్వామి, పులి ప్రశాంత్ గౌడ్, చిట్యాలకు చెందిన సూరం స్వామితో చాలాకాలంగా పరిచయం ఉంది. వీరి మధ్య గతంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. బూస శ్రీనివాస్ వద్ద భారీ మొత్తంలో అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. సదరు వ్యాపారి వద్ద పెద్ద మొత్తంలో సంపద ఉన్నట్లు భావించి ఈజీ మనీ కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. వ్యాపారి బూస శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేయడానికి ప్లాన్ వేశారు. తుపాకీ కొనుగోలు చేయడానికి మహారాష్ట్రలోని నాయేగావ్‌కు చెందిన అజయ్ హన్మంతరావు గోంగపాలే, వైభవ్ ప్రకాష్ బరాడేవార్‌లను సంప్రదించారు. ఈనెల 12న నర్సింగరావు, ఒడ్డె స్వామి మహారాష్ట్రకు వెళ్లి అజయ్, వైభవ్‌ల ద్వారా నాయేగావ్‌కు చెందిన మారుతి గోకేను కలిశారు. రూ. 30 వేలకు తుపాకీ కొనుగోలుకు ఒప్పందం చేసుకుని రూ. 27 వేలు చెల్లించారు. ఈనెల 27 న మారుతి గోకే తుపాకీని వైభవ్ ప్రకాశ్ బరాడేవార్, అజయ్ హన్మంతరావ్ గోంగపాలేలకు అందించాడు. వారు దానిని తీసుకుని కృష్ణాజీవాడీ గ్రామ సమీపానికి వచ్చారు.
కృష్ణాజీవాడి శివాలయం సమీపంలో కొంత మంది అనుమానితులు ఏదో నేరం చేయడానికి కుట్ర పన్నుతున్నారనే సమాచారం రావడంతో తాడ్వాయి ఎస్సై నరేశ్, సిబ్బంది బుధవారం తనిఖీలు చేపట్టారు. పోలీసుల రాకను గమనించి అక్కడ నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా వెంబడించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నిట్టు నర్సింగరావు, ఒడ్డె స్వామి, పులి ప్రశాంత్ గౌడ్, సూ రం స్వామి, అ జయ్ హన్మంతరావు గోంగపాలే, వైభవ్ ప్రకాష్ బరాడేవార్‌లను విచారించగా కిడ్నాప్ ప్లాన్ బయటపడింది. వారి వద్ద నుంచి ఒక నల్ల రంగు తుపాకీ, ఆరు రబ్బరు బుల్లెట్లు, 2 ఎయిర్ రైఫిల్ పెల్లెట్ బాక్సులు, 5 సెల్‌ఫోన్‌లు స్వాధీ నం చేసుకున్నారు. ధనికుడైన బూస శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసి అతడి కుటుంబ సభ్యుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయాలని కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందని ఎస్పీ తె లిపారు. కుట్రకు సంబంధించిన పూర్తి సమాచారం, ప్రమేయం ఉన్న వ్యక్తులు అందరినీ గుర్తించడానికి ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు పర్యవేక్షణలో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి, సదాశివనగర్ ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది శ్రీనివాస్, యాదగిరి, సీసీఎస్ పీసీలు మైసయ్య, కిషన్ తదితరులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించామ న్నారు. ఈ కేసులో మరో నిందితుడైన మారుతి గోకే పరారీలో ఉన్నాడన్నారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.


