అడ్మిషన్‌ ప్లీజ్‌.. | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్‌ ప్లీజ్‌..

May 26 2026 7:54 AM | Updated on May 26 2026 7:54 AM

ఆర్మూర్‌: ప్రైవేట్‌ పాఠశాలల టీచర్ల బతుకులు దయనీయంగా మారాయి. వేతనం కోసం మండుటెండలో యాజమాన్యాలు నిర్దేశించిన పిల్లల అడ్మిషన్ల కోసం వీధుల బాట పట్టారు. జిల్లాలో మొత్తం 1,426 ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూల్స్‌ ఉ న్నాయి. వీటిలో సుమారు 250 వరకు ప్రైవే టు స్కూల్స్‌ ఉన్నాయి. ఒక్కో స్కూల్‌లో సగటున 20 నుంచి వంద మంది టీచర్లు విధులు నిర్వహి స్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో 10 వేలకు పైగా ప్రైవేట్‌ టీచర్లు ఉంటారని అంచనా. వీరికి నెల వేతనం రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు ఉన్నాయి. ఈ వేతనం కూడా వేసవి సెలవుల్లో ఇవ్వరు. ఇక్కడే వేతనం కోసం ఎదురు చూసే ప్రైవేటు టీచర్ల నిస్సహాయతను ఆసరా చేసుకు ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమన్యాలు వారికి అడ్మిషన్ల పనులు పురమాయిస్తున్నారు. ప్రతి ప్రైవేట్‌ టీచర్‌ రెండు నెలల్లో పది అడ్మిషన్లు తే వాలి. లేకపోతే ఏప్రిల్‌, మే జీతాలు ఇవ్వం అని తెగేసి చెబుతున్నారు. దీంతో తప్పేది లేక పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో సైతం ఎండను లెక్క చేయకుండా ప్రైవేట్‌ టీచర్లు ఉదయం, సాయంత్రం ఇంటింటికీ తిరిగి అడ్మి షన్లు అడుగుతున్నారు. ఇది చాలదు అన్నట్లు పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయుల లొకేషన్‌ను వాట్సప్‌లో తెప్పించుకొని మానిటరింగ్‌ చేస్తూ వేధింపులకు సైతం పాల్ప డుతున్నారు. టీచర్‌ అంటే సమాజంలో గౌరవం. కానీ ఇప్పుడు తల్లిదండ్రుల కాళ్లు పట్టుకుని మా స్కూల్‌లో చేర్పించండి అని అడగాల్సి వస్తోంది. చాలా అవమానంగా ఉంది అంటూ ప్రైవేట్‌ టీచర్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్‌ స్కూల్‌లో అడ్మిషన్ల కోసం ఎండలో ఇంటింటికీ తిరుగుతున్న టీచర్లు

ఉద్యోగం మానేస్తూ..

ప్రైవేటు పాఠశాలలతో పాటు పలు ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్యాలు టీచర్స్‌కు వేతనాలు ఇవ్వని కారణంగా చాలా మంది టీచర్లు ఉద్యోగాలు మానేసి కూలీ పనులకు వెళ్తున్నారు. ఆర్మూర్‌ పట్టణానికి చెందిన ఒక ప్రైవేట్‌ టీచర్‌ పెర్కిట్‌లో టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకొన్నాడు. కోవిడ్‌ సమయంలో వేతనాలు ఇవ్వని కారణంగా చాలా మంది ప్రైవేట్‌ టీచర్లు స్వయం ఉపాధి కల్పించుకోవడమో లేక కూలీ పనికి వెల్లడమో చేసారు.

ప్రభుత్వమే బడిబాట చేస్తోంది..

వేతనాల సాకుతో టీచర్స్‌తో వెట్టి చాకిరీ చేయిస్తున్న ప్రైవేట్‌ యాజమాన్యాలు ప్రభు త్వం కూడా బడి బాట పేరుతో టీచర్లను అడ్మిషన్ల కోసం పంపిస్తోంది. మేము చేయి స్తే తప్పేంటి మాకు వేరే దారి లేదు అంటు న్నారు. టీచర్‌ ఇంటికి వెళ్లి అడిగితేనే పేరెంట్స్‌ పిల్లల్ని చేర్పిస్తున్నారు అంటూ తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభు త్వ పాఠశాలల ఉపాధ్యాయుల వేతనాలు, పని దినాలు, పని ఒత్తిడిని ప్రైవేట్‌ టీచర్లతో పోల్చితే ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఎక్కడా పొంతన కుదరదు.

పిల్లల తల్లిదండ్రులను

వేడుకుంటున్న ప్రైవేట్‌ టీచర్లు

వేతనాల కోసం

మండుటెండలో తంటాలు

దయనీయంగా మారిన బతుకులు

వేతనం కోసం తప్పడం లేదు..

కుటుంబ పోషణ నా భర్త ఒక్కడి వల్లనే కావడం లేదని ఆయనకు చేదోడువాదోడుగా ఉందామని ప్రై వేట్‌ స్కూల్‌లో చేరాను. రెండు నెలలు వేతనం రాకపోతే చిట్టిలు, మహిళా సంఘంలో తీసుకున్న రుణాలకు డబ్బులు కట్టడం ఇబ్బందిగా మారుతుంది. తప్పని పరిస్థితుల్లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులను వేడుకోవాల్సి వస్తోంది.

– లలిత, ప్రైవేట్‌ టీచర్‌, ఆర్మూర్‌

చదువుకు తగ్గ గౌరవం లభించడం లేదు..

చదువుకున్నాము కదా ఖాళీగా ఉండటం ఎందుకులే అని ప్రైవేట్‌ స్కూల్‌లో చేరితే ఆ చదువుకు తగ్గ గౌరవం లభించడం లేదు. వేసవి సెలవుల్లో వేతనం కోసం అడ్మిషన్ల వేటలో మేము టీచర్లము అనే ఆత్మాభిమానాన్ని సైతం కోల్పోతున్నాము.

– రమణ, ప్రైవేట్‌ టీచర్‌, ఆర్మూర్‌

Advertisement
 
Advertisement
Advertisement