నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని తాండూర్‌కు చెంది న బోరంచ సునీల్(33)అనే వ్యక్తి గ్రామశివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకు న్న ఘటన శనివారం వెలుగుచూసింది. ఈ నెల 20వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లిన సునీల్ తిరిగి రాకపోవడంతో అతడి భార్య స్రవంతి పోలీసులకు శుక్రవా రం ఫిర్యాదు చేసింది. గ్రామ శివారులో ఉరేసుకొని సునీల్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌చార్జి ఎస్సై సుబ్రమణ్యచా రి ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో ఘటనాస్థలంలోనే పోస్ట్‌మార్టం పూర్తి చేయించారు.
కుటుంబ కలహాల కారణంగా మరొకరు..
బోధన్: ఎడపల్లి మండలం జానకంపేటకు చెందిన ఉప్పు నాగేశ్వర్ (58) అనే వ్యక్తి కు టుంబ కలహాల కారణంగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి.. గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న ఓ రైస్‌మిల్లులో కొంత కాలంగా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నా నాగేశ్వర్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి విధులకు వెళ్లిన నాగేశ్వర్ మరుసటి రోజైన శనివారం రైస్‌మిల్లులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా మనస్థాపంతో ఆ త్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు తెలిపా రు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎడపల్లి పోలీసులు తెలిపారు.


