సుప్రీం తీరు్పతో ఊరట! | - | Sakshi
Sakshi News home page

సుప్రీం తీరు్పతో ఊరట!

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

కుక్కకాటు బాధితుల మనోగతం

వాటి దాడులు ఆగుతాయని ఆశాభావం

జీజీహెచ్‌కు రోజూ కుక్కకాటుతో

10 మంది రాక

నల్లమట్టి పక్కదారి!

ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ లో తవ్వుతున్న నల్లమట్టి పక్కదారి పడుతోంది. రైతుల పేరు చెప్పి ఇతర అవసరాలకు తరలిస్తున్నారు.

శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026

– 8లో u

నిజామాబాద్‌అర్బన్‌ : తరుచూ జనాలపై దాడులు చేస్తున్న వీధి శునకాలకు కారుణ్య మరణాలు చేపట్టాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు సబబేనని, ఊరట కలిగిస్తోందని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. జిల్లాలో కుక్కల దాడులతో అనేక మంది గాయాల పాలయ్యారు. మరణాలు సంభవించాయి. మాక్లూర్‌ మండలం కల్లెడి గ్రామంలో 2023లో నిహన్‌ అనే ఐదేళ్ల బాలుడు తన తాతతో కలిసి బయటకు వెళ్లాడు. అంతలోనే విధి కుక్కలు దాడి చేయడంతో మరణించాడు.

● నగరంలోని గాయత్రి నగర్‌లో గతేడాది సెప్టెంబర్‌లో ఐదుగురు పిల్లలపై కుక్కలు దాడి చేశాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

● జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి ప్రతి రోజు 10 నుంచి 15 మంది వరకు కుక్కకాటు బాధితులు వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వారం రోజుల్లో 3 నుంచి 4 వరకు కేసులు వరకు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో అనేక ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కుక్కల పట్ల జాగ్రత్త ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు.

కుక్కలతొ పొంచి ఉన్న ప్రమాదం

జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతకు కుక్కలు సైతం తమ స్వభావాన్ని మార్చుకుంటున్నాయని, కుక్కల్లో విపరీతమైన ఇరిటేషన్‌ వచ్చి దాహం ఎక్కువై దాడులకు దిగబడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. గత నెలలో ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి కుక్కకాటుకుతో 250 నుంచి 300 మంది వరకు చికిత్స కోసం వచ్చారు. ఈ నెలలో ఇప్పటికు 267 మంది కుక్కకాటు బాధితులు ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు.

● మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ఇటీవల గాయత్రి నగర్‌, సీతారాంనగర్‌ కాలనీలో విద్యార్థులపై కుక్కలు దాడులు చేశాయి.

● బోధన్‌ డివిజన్‌లోని రుద్రూర్‌, కోటగిరి మండల కేంద్రాల్లో కొత్త గ్రామ పంచాయతీ పాలక వర్గం వీధి కుక్కల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. రుద్రూర్‌లో నెల రోజుల క్రితం 50 వరకు వీధికుక్కలను పట్టుకొని ఇతర ప్రాంతాలకు తరలించారు.

వీధికుక్కల భయానికి చెక్‌

ఆర్మూర్‌టౌన్‌ : ఆర్మూర్‌ మున్సిప ల్‌ పరిధిలో సుమారు 1400 పైన వీధికుక్కలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 257మంది కుక్కకాటుకు గురయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కుక్క కాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement