ట్రాన్స్‌జెండర్లపై నిషేధం వద్దు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌జెండర్లపై నిషేధం వద్దు

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

మితిమీరి ప్రవర్తిస్తున్నారు తలదించుకోవాల్సి వస్తోంది ఆగడాలను నియంత్రించాలి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : పెళ్లిళ్లు, పేరంటా లు, గృహ ప్రవేశాలు, ప్రారంభోత్సవాలు, ఇత ర శుభకార్యాల సమయంలో ట్రాన్స్‌జెండర్లు ని ర్దేశిత మొత్తంలో డబ్బులు వసూలు చేయడం సాధారణం. అయితే కొంతకాలంగా జిల్లాలోని చాలా గ్రామాల్లోకి వస్తున్న ట్రాన్స్‌జెండర్లు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేస్తూ, అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నారని గ్రామీణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో గ్రామాల్లోకి ట్రాన్స్‌జెండర్ల రాకను నిషేధిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లె క్సీల ఏర్పాటులో వీడీసీలదే కీలకపాత్ర. దీంతో తమ హక్కులకు భంగం కలుగుతోందంటూ ట్రాన్స్‌జెండర్లు ఇటీవల కలెక్టరేట్‌ వద్ద ధర్నా, ని రసన కార్యక్రమాలు చేశారు. అయినప్పటికీ ఇంకా పలు గ్రామాల్లోకి ట్రాన్స్‌జెండర్లు రావద్దంటూ పంచాయతీ పాలకవర్గాలు తీర్మానాలు చేస్తున్నాయి. తాజాగా డొంకేశ్వర్‌ మండలంతొండాకూర్‌ పంచాయతీ పాలకవర్గం ట్రాన్స్‌జెండర్లకు ప్రవేశం లేదంటూ తీర్మానం చేసింది. ఈ క్రమంలో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి గురువారం రాష్ట్రంలోనే మొదటిసారిగా గ్రామాల సర్పంచ్‌ లు, ట్రాన్స్‌జెండర్లతో సమావేశం నిర్వహించారు.

మానవతా దృక్పథంతో చూడాలి

ట్రాన్స్‌జెండర్ల విషయంలో ప్రజలు మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని సమావేశంలో క లెక్టర్‌ సూచించారు. కాగా సిరికొండ మండలం మైలారం గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనతో పాటు మరికొన్ని గ్రామాల్లో జరిగిన ఉదంతాలపై కలెక్టర్‌ ఇరువర్గాల వాదనలు విన్నారు. ట్రాన్స్‌జెండర్లు గ్రామాల్లోకి వచ్చి భారీగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని, అడిగినంత ఇవ్వకపోతే అనుచితంగా ప్రవర్తిస్తున్నారని సర్పంచ్‌లు కలెక్టర్‌కు తెలిపారు. ట్రా న్స్‌జెండర్ల వేషధారణలో కొందరు నకిలీలు వ స్తున్నారని తెలిపారు. గ్రామస్తుల ఏకాభిప్రా యం మేరకే నిషేధం విధిస్తూ తీర్మానాలు చేసి నట్లు తెలిపారు. అయితే ఈ బహిష్కరణలతో తమ గౌరవానికి భంగం కలుగుతోందని, జీవనోపాధి కోల్పోతున్నామని ట్రాన్స్‌జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నకిలీల కారణంగా తమపై ఆంక్షలు భావ్యం కాదన్నారు.

వాదనలు విన్న కలెక్టర్‌ నకిలీల బెడదను ని వారించేందుకు ట్రాన్స్‌జెండర్లను జిల్లా సంక్షేమ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నా రు. ట్రాన్స్‌జెండర్లు బలవంతపు వసూళ్లతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దన్నారు. సమాజంలో ట్రాన్స్‌జెండర్లను శివసత్తులుగా కొలుస్తూ, తమ కు తోచిన మేరకు డబ్బులు ఇస్తుంటారన్నారు. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ట్రా న్స్‌జెండర్లపై ఉందన్నారు. ట్రాన్స్‌ జెండర్లు అంగీకరించడంతో బహిష్కరణలను ఉపసంహరించుకుంటామని సర్పంచ్‌లు అంగీకరించారు. అ యితే వీడీసీలు డామినేట్‌ చేసే గ్రామాల్లో భవి ష్యత్తులో ఈ సయోధ్య నిలిచేనా అనే చర్చ సై తం జరుగుతోంది. డీపీవో శ్రీనివాసరావు, ఏసీ పీ ప్రకాష్‌యాదవ్‌, డీడబ్ల్యూవో పద్మ, ఏవో రా జబాబు, జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మునిపల్లి చిన్నసాయిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, డీఎల్పీవో పాల్గొన్నారు.

హాజరైన సర్పంచ్‌లు, ట్రాన్స్‌జెండర్లు

అడిగిన డబ్బులు ఇవ్వకపోతే శుభకార్యానికి వ చ్చి ఆటంకం కల్పిస్తు న్నారు. ఏదైనా మాట్లాడితే మితిమీరి ప్రవర్తిస్తు న్నారు. సంతోష సమయంలో అవమానకరమైన చర్యలకు పూనుకుంటున్నారు. శాపనార్థా లు పెడుతున్నారు. లేదంటే బట్టలు విప్పుకుంటామని బెదిరిస్తున్నారు. శుభ సమయంలో సంతోషం కంటే బాధే ఎక్కువవుతోంది. శుభకార్య విషయం వారికి ఎలా తెలుస్తుందో ఎవరు చెబుతున్నారో తెలియదు.వచ్చి మరీ ఇబ్బంది పెడుతున్నారు.

–మల్యాల సుభాష్‌గౌడ్‌, కమ్మర్‌పల్లి.

ఇంటి ముందర టెంట్‌ కనిపిస్తే చాలు హిజ్రాలు ఆటోలో వచ్చి రూ. వేలల్లో డిమాండ్‌ చేస్తున్నారు. వారు అడిగినంత ఇవ్వకపోతే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తనతో ఇంట్లో పిల్లలు, పెద్దలు, మహిళల ముందు తలదించుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. పెళ్లి పందిట్లో కూర్చోని పనులకు ఆటంకం కల్పించడం లాంటి పనులు చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే బూతు మాటలు తిడుతూ అవమాన పరుస్తున్నారు. –మోర్తాడ్‌ లింబాద్రి,

బడా భీమ్‌గల్‌, భీమ్‌గల్‌ మండలం

ఎక్కడ శుభ కార్యాలు జరిగినా అక్కడికి వచ్చి, అడిగినన్ని డబ్బులు ఇచ్చే వర కు అసభ్యకరమైన చేష్టలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించి హిజ్రాలకు ఏదైన ఉపాధి కల్పించాలి. అప్పుడే శుభకార్యాలు జరుపుకునే వారికి ఉపశమనం లభిస్తుంది. – పవన్‌ కళ్యాణ్‌, ఆలూర్‌

జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

రాష్ట్రంలోనే మొదటిసారి సర్పంచ్‌లు, ట్రాన్స్‌జెండర్లతో ప్రత్యేక

సమావేశం నిర్వహణ

నకిలీల బెడద నివారించేందుకు గుర్తింపు కార్డుల జారీకి నిర్ణయం

అన్ని గ్రామాల్లో వీడీసీలు

అంగీకరిస్తాయా.. జిల్లాలో చర్చ

Advertisement
 
Advertisement
Advertisement