కిరికిరి లేని జీపీలకే మొగ్గు! | - | Sakshi
Sakshi News home page

కిరికిరి లేని జీపీలకే మొగ్గు!

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌) : జిల్లాలో నాలుగేళ్ల సు దీర్ఘ కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శులకు నాలుగైదు రోజుల్లో సాధార ణ బదిలీలు జరగనున్నాయి. ఐతే, ఇటీవల ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఆప్షన్ల న మోదు ప్రక్రియలో క్షేత్రస్థాయి సమీకరణల ను బేరీజు వేసుకుని మరీ మొత్తం 171 మంది తమ ఐచ్చికాలను సమర్పించారు. నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరూ ఐదు జీపీలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకునే అవకాశం లభించగా, మెజారిటీ కార్యదర్శులు వివాదా ల్లేని స్థానాల కోసమే వెతికారు. గతంలో స ర్పంచులతో వచ్చిన విభేదాలు, స్థానిక రాజకీయాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చాలా జాగ్రత్త పడ్డారు. నిరంతరం సర్పంచ్‌లు లే దా స్థానిక నేతలతో ఘర్షణలు జరిగే పంచాయతీల జోలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. ఎలాంటి విభేదాలు లేని, అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండే మంచి పాలకవర్గం ఉన్న గ్రామ పంచాయతీలను ప్రత్యేకంగా వెతికి పట్టుకుని మొదటి ప్రాధాన్యతగా ఆప్షన్లు ఇచ్చుకున్నారు. కాగా పాలకవర్గంతో పాటు ఆర్థిక వనరులు కూడా కార్యదర్శుల ఎంపికలో కీలకపాత్ర పోషించాయి. సొంత ఆదాయ వనరులు బాగుండి, నిధుల కొరత లేని జీపీలను కార్యదర్శులు ఎక్కువగా ఎంచుకున్నారు. ఆదాయం బాగుంటే గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా చేయవచ్చని, ఎలాంటి పెండింగ్‌ బిల్లుల సమస్యలు రావనే ఉద్దేశంతో మంచి ఆదాయమున్న జీపీలకే జై కొట్టారు. అదే విధంగా చాలా కాలం పాటు ఇబ్బందికరమైన గ్రామాల్లో పని చేసి విసిగిపోయిన వారు ఈ బదిలీలను ఒక మంచి అవకాశంగా భావించారు. రవాణా సౌకర్యాలు బాగుండి తమ నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండే జీపీలను కూడా ఐదు ఆప్షన్లలో చేర్చుకున్నారు. కావాల్సిన జీపీలను దక్కించుకోవడానికి కొందరైతే ముడుపులు సైతం సిద్ధం చేసుకుని పైరవీలకు సైతం తెరలేపారు. మొత్తానికి ఈ బదిలీల ఆప్షన్ల సరళిని గమనిస్తే... కార్యదర్శులు ఒత్తిడి లేని పని వాతావరణం, ప్రశాంతమైన పాలకవర్గం వైపే మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోంది.

ఆచితూచి బదిలీ ఆప్షన్లు పెట్టుకున్న

పంచాయతీ కార్యదర్శులు

వివాదాలు, గొడవలున్న

గ్రామాలకు దూరం

మంచి పాలకవర్గం, నిధులున్న

పంచాయతీలపైనే దృష్టి

Advertisement
 
Advertisement
Advertisement