విద్యాశాఖలో బదిలీలు | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖలో బదిలీలు

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

ఖలీల్‌వాడి : జిల్లా కేంద్రంలోని సమీకృత క లెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జూనియర్‌ ఆసిస్టెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌, రికార్డు ఆసిస్టెంట్‌లకు బదిలీలు నిర్వహించారు. డీఈవో పార్శి అశోక్‌ పర్యవేక్షణలో అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ బదిలీలను చేశారు. ఈ బదిలీల్లో 14 మంది జూనియర్‌ ఆసిస్టెంట్‌లు, ఆరుగు రు ఆఫీస్‌ సబార్డినేట్‌లు, ఇద్దరు రికార్డు ఆసిస్టెంట్లు ఉన్నట్లు డీఈవో తెలిపారు. బదిలీ అ యిన ఉద్యోగులు ఈనెల చివరి వరకు ఆయా స్థానంలో జాయిన్‌ కావాలన్నారు.

జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు

పెరిగిన వేడి గాలుల తీవ్రత

నిజామాబాద్‌ అర్బన్‌ : జిల్లాలో రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత పది రోజులుగా ఎండల తీవ్రత విపరీతంగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వేడిగాలుల తీవ్రత ఉంటోంది. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. జిల్లాలో గురువారం బాల్కొండ కేంద్రంలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నిర్మల్‌ జిల్లాలోని దిల్వార్‌పూర్‌లో 46.5, హన్మకొండలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. జిల్లాలో ప్రజలు ఎవరు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని అధికారులు పేర్కొంటున్నారు. వేడి గాలుల తీవ్రత వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

స్వేచ్ఛగా ఎక్కడైనా పనిచేసుకోవచ్చు

ఆర్మూర్‌టౌన్‌: జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి చొరవతో బానిస బతుకుల నుంచి విముక్తులైన ఆలూర్‌ మండలం దే గాం ఇట్టుక బట్టీ కార్మికులు ఇక ఎక్కడైనా స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి అన్నారు. ఆర్మూర్‌లోని బాలుర పాఠశాలలో గురువారం 22 మంది బాధితు లకు బాండెంట్‌ లేబర్‌ రిలీజ్‌ సర్టిఫికెట్‌తో పాటు ప్రభుత్వ కార్మిక శాఖ నుంచి రూ.30 వేల చొప్పున అందజేశారు. ఆమె మాట్లాడు తూ ఇటుక బట్టీ కార్మికుడు బాబు చేసిన ధై ర్యం వల్లే 112 కుటుంబాలు బానిస బతుకు ల నుంచి బయట పడ్డాయని, భవిష్యత్తులో ఏ కార్మికులకు కూడ ఇలాంటి గతి పట్టకుండా కార్మిక చట్టాల ద్వారా బట్టీల యజమానులపై అన్ని రకాల చర్యలు తీసుకుంటామ న్నారు. తమిళనాడుకు వెలుతున్న బాధితుల కు రోటరీక్లబ్‌సభ్యులు భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ అ భిగ్యాన్‌ మాల్వియ, డిప్యూటీ కమిషన్‌ ఆఫ్‌లే బర్‌ యాదయ్య, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ శ్రావణి, తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎస్‌హెచ్‌వో సత్యనారయణగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement