హలో ఫ్రెండ్స్...నా పేరు అర్వి న్. విజయ్ పబ్లిక్ స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్నాను. ఈ వేసవి సెలవుల్లో నానమ్మ కృపారాణి, టూర్ ప్లానర్స్ అత్త ఉజ్వల, మామయ్య ప్రేమ్‌సాగర్, బంధువులతో కలిసి టూర్‌కు వెళ్లాం. బాపట్ల బీచ్‌లో శాండ్ బైక్ రైడింగ్ చేశాను. చీరాల బీచ్‌లో ఎంతో ఆసక్తికరమైన, లైఫ్ టైమ్ గుర్తుండిపోయే పారా గ్లైడింగ్ చేశాను. ఊటీలో టీ తోటలు, ఆహ్లాదకరమైన ప్రదేశాలను సెలవుల్లో ఆస్వాదించాను. నల్లముడి వ్యూవ్ పాయింట్‌లో లోయలోకి మేఘాలు దిగివచ్చినట్టు ఉండే ప్రకృతి అద్భుతాలను ఆనందించాను.


