సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్‌ఎస్ సభ్య త్వ నమోదు ప్రక్రియ కోసం పార్టీ నాయకత్వం గురువారం ఇన్‌చార్జీలను నియమించింది. ఉమ్మడి జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలు వీరే.. ఆర్మూర్ : కాంతారెడ్డి తిరుపతిరెడ్డి, బోధన్ : డి విఠల్‌రావు, జుక్కల్ : మాటం భిక్షపతి, బాన్సువాడ : తోట ఆగయ్య, ఎల్లారెడ్డి : దఫేదార్ రాజు, కామారెడ్డి : షేరి సుభాష్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ : రవీందర్‌సింగ్, నిజామాబాద్ రూరల్ : గిర్ధావర్ గంగాధర్, బాల్కొండ : దావా వసంత.
డొంకేశ్వర్(ఆర్మూర్): తమ గ్రామంలోనికి హి జ్రాలు రావొద్దని డొంకేశ్వర్ మండలం తొండాకూర్ గ్రామ పంచాయతీ గురువారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. గ్రామంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఇతర శుభ కార్యాలు జరిగితే సమాచారం తెలుసుకుని గుంపులుగా వచ్చి డబ్బుల కోసం ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తు ల నుంచి ఫిర్యాదుల వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ అల్లారి గంగాధర్ తెలిపారు. ఈ తీర్మానాన్ని ఉల్లంఘించి హిజ్రాలు ఊరిలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులు పెడితే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పాలకవర్గ సభ్యులు స్పష్టం చేశారు.
● సిగరెట్లు, గుట్కాలు విక్రయిస్తే జరిమానా
● ఎడపల్లి జీపీ పాలకవర్గం తీర్మానాలు
బోధన్: ఎడపల్లి గ్రామంలో గంజాయితోపాటు సిగరెట్లు, గుట్కాల నిషేధానికి గ్రామ పంచాయతీ పాలక వర్గం కఠిన చర్యలు తీసుకుంటోంది. గ్రామంలో ఎవరైనా గంజాయి అమ్మినా, తాగినట్టు తెలిసినా సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల బహుమతి అందిస్తామని, అలాగే సిగరెట్లు, గుట్కాలు విక్రయిస్తే రూ.10వేల జరిమానా విధించడంతోపాటు సమాచారం అందించిన వారికి రూ.5వేల బహుమతి ఇవ్వాలని పాలకవర్గం తీర్మానాలు చేసింది. సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లను గోప్యం ఉంచుతామని ప్రకటించింది. డ్రగ్స్ సేవించడం జీవితాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనమని సర్పంచ్ కందగట్ల రాంచందర్ అన్నారు. గ్రామ యువత, పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పంచాయతీ పాలక వర్గం తీర్మానాలు చేసినట్లు తెలిపారు.


