● కాపాడిన హోంగార్డు.. వృద్ధాశ్రమానికి తరలింపు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు య త్నించిన ఓ వృద్ధురాలిని హోంగార్డు కాపాడి ఆశ్రమానికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లోని బోయిరగల్లీకి చెందిన జంబూక రాజగంగ(62) వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ ధర్మగుండం వద్ద బుధవారం ఆత్మహత్యకు యత్నించింది. దీనిని గమనించిన హోంగార్డు పద్మ కాపాడి వేములవాడ చారిటబుల్ ట్రస్ట్, స్థానిక పోలీసులకు సమా చారం అందించారు. వారు వృద్ధురాలికి కౌన్సెలింగ్ ఇచ్చి తంగ ళ్లపల్లి మండలం ఓబు లాపూర్‌లో గడ్డం తిరుమల శ్రీనివాస్ నిర్వహిస్తున్న ‘అమ్మ అనాథ వృద్ధాశ్రమం’లో చేర్పించారు.


