● ఇసుక అక్రమ రవాణాపై కొరడా
● ఒక జేసీబీ, ఐదు ట్రాక్టర్లు స్వాధీనం
నందిపేట్/నవీపేట్ : ఇసుక అక్రమరవాణాపై చీతా ఫోర్స్ కొరడా ఝుళిపించింది. నందిపేట మండలంలోని తల్వేద – నవీపేట మండలం నాళేశ్వర్ మధ్య వాగులో ఇసుక తోడుతున్న ఒక జేసీబీతోపాటు తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సీజ్ చేశారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటైన చీతా టీమ్ పక్కా సమాచారం మేరకు బుధవారం దాడులు నిర్వహించింది. వాహనాలను నందిపేట్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అక్రమ ఇసుక రవాణా, ప్రకతి వనరుల దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.


