ఎన్నారైల సంక్షేమానికి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

ఎన్నారైల సంక్షేమానికి ప్రాధాన్యత

May 21 2026 12:38 AM | Updated on May 21 2026 12:38 AM

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): తెలంగాణలో కొత్త ఎన్నారై విధివిధానాల రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్‌ పర్యటన కీలకంగా మారనుందని రూరల్‌ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంది. మొదటి రోజు అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ బీఎం వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే భూపతిరెడ్డి నాయకత్వంలో ఏపీ ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కమిటీ భేటీ అ య్యింది. ఎన్టీఆర్‌ జిల్లా తాడేపల్లిలో ఉన్న ఏపీఎన్‌ఆ ర్‌టీ సొసైటీ కార్యాలయంలో ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేమూరు విజయ్‌ కుమా ర్‌, సీఈవో కృష్ణమోహన్‌తో ఎన్నారై విధానాలు, పలు కీలక అంశాలపై చర్చించారు. రాబోవు రోజుల్లో తెలంగాణలో ఎన్నారై సంక్షేమానికి విధివిధానాల రూపకల్పనకు తమ పర్యటన ఎంతో దోహదపడుతుందని భూపతిరెడ్డి అన్నారు. గల్ఫ్‌ కార్మికులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. సమావేశంలో తెలంగాణ ఎన్నారై కమిటీ వైస్‌ చైర్మన్‌ మంద భీంరెడ్డి, మెంబర్లు సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, నంగి దేవేందర్‌రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్‌రావుతోపాటు ఐడీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ సాయిరెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, ప్రొఫెసర్లు జునుగురు శ్రీనివాస్‌, విజయ్‌ కొర్రా, ప్రవాసీ ప్రజావాణి కో ఆర్డినేటర్‌ బొజ్జ అమరేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement