క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా బస్‌ టికెట్‌ బుకింగ్‌ .. | - | Sakshi
Sakshi News home page

క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా బస్‌ టికెట్‌ బుకింగ్‌ ..

May 21 2026 12:38 AM | Updated on May 21 2026 12:38 AM

టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో ఏర్పాట్లు

నిజామాబాద్‌ రూరల్‌: టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో డిపో బుకింగ్‌ కౌంటర్లలో ఇకపై క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా టికెట్లు బుకింగ్‌, బస్‌ పాస్‌ క్యూఆర్‌ కోడ్‌ సదుపాయం అందుబాటులోకి తీసుకచ్చినట్లు జిల్లా రీజనల్‌ మేనేజర్‌ జోస్నా బుధవా రం తెలిపారు. ఆమె మాట్లాడుతూ ప్రయాణికులు, విద్యార్థులు నగదు చెల్లింపులతో పాటు గూగుల్‌ పే, ఫోన్‌పే , పేటీఎం వంటి యూపీఐ యాప్ల ద్వారా క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి సులభంగా టికెట్లు పొందవచ్చనన్నారు. ఈ విధానం ద్వారా చిల్లర సమస్యలు తగ్గడంతో పాటు వేగవంతమైన సేవలు అందించవచ్చన్నారు. నిజామాబాద్‌ రీజియన్‌లోని ప్రతి డిపో బుకింగ్‌ కౌంటర్‌ వద్ద క్యూ ఆర్‌ కోడ్‌ సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ డిజిటల్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రీజనల్‌ మేనేజర్‌ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement