నిజాంసాగర్(జుక్కల్): ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి ఆత్మహత్యాయత్నం చేసిన మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన కుర్మ సత్యం(35) అనే వ్యక్తి మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం పురుగుల మందు సేవించిన సత్యంను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న సత్యం పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బ్యాంకు వద్ద వ్యక్తి ..
ఎల్లారెడ్డి రూరల్: ఎల్లారెడ్డి పట్టణంలోని కో ఆపరేటివ్ బ్యాంకు వద్ద ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై రాజు బుధవారం తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని స్థానికులు సమాచారం అందించగా, ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతుడి ఫొటోను స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశామన్నారు. చివరకు మృతుడిని అడివిలింగాల గ్రామానికి చెందిన సాయిలుగా గుర్తించి బంధువులకు సమాచారం అందించినట్లు ఎస్సై తెలిపారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు భావిస్తున్నామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


