ఉద్యోగార్థులకు ఊరట | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగార్థులకు ఊరట

May 21 2026 12:32 AM | Updated on May 21 2026 12:32 AM

క్రమబద్ధంగా నోటిఫికేషన్లు

వేయాలని డిమాండ్లు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలకు పెంచడంపై అత్యధిక మంది ఉద్యోగార్థుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అయితే నోటి ఫికేషన్లు వెంటనే ఒక క్రమపద్ధతి ప్రకారం ఇవ్వా లని కోరుతున్నారు. వయోపరిమితి పెంచడంతో ఒకవైపు సంతోషం ఉన్నప్పటికీ ఏటా కొత్తగా వస్తున్న ఉద్యోగార్థుల నుంచి తమకు మరింత పోటీ ఎదురవుతుందని ఇప్పటికే ఏళ్లతరబడి ప్రిపేరవుతున్న నిరుద్యోగులు అంటున్నారు. కొత్తగా వస్తున్న పట్టభద్రులు సైతం తమకు మరింత పోటీ ఉంటుందంటున్నారు.

త్వరగా జాబ్‌ నోటిఫికేషన్లు వేయాలి

ప్రభుత్వ ఉద్యోగాలకు వ యోపరిమితి పెంచడం మంచిదే కానీ, ఉద్యోగా ల నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఎన్నేళ్ళు వయో పరిమి తి పెంచితే ఏం లాభం? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాన న్న ఉద్యోగాల విషయం ఏమైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయలేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం జాబ్‌ నోటిఫికేషన్లు వేయకపోవడం వల్లనే నిరుద్యోగుల వయో పరిమితి దాటిపోతోంది. – బి.శివ,

తెలంగాణ స్టేట్‌ యూనివర్సిటీస్‌ కన్వీనర్‌.

ఉద్యోగ అర్హత వయసు పెంచడం ఒక వరమే

ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే వారి అర్హత వయ సు 44 వరకు పెంచడం ఒక వరమే. ఎంతోమంది డిగ్రీ పేజీలు చదివి నోటి ఫికేషన్‌ లేక ఇంటి వద్ద ఉంటూ పనులు చేసుకుంటున్నారు వారికి అదృష్టం పరీక్షించుకునే అవకాశం దక్కింది. – జక్కం అశోక్‌, మోర్తాడ్‌

నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ నియామాకాల్లో వయో పరిమితిని పదేళ్ల పాటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయం. పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉద్యోగం రాక పోవడంతో ప్రైవేట్‌ జాబ్‌ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వయో పరిమితి దాటిన నిరుద్యోగ యువతీ యువకులకు మంచి అవకాశం లబిస్తుంది.

– మాగిడి రాఘవేందర్‌, నిరుద్యోగి

నిరుద్యోగులకు భరోసా

కల్పించాలి

వయోపరిమితి పెంచడమే కాకుండా నిరుద్యోగులకు భరోసా కల్పించే విధంగా నిరుద్యోగ భృతి నెలకు రూ.4000 ఇవ్వాలి. ఇప్పటికే పిల్లల్ని కుటుంబాన్ని వదిలి కోచింగ్‌ సెంటర్ల వైపు వెళ్లటం లక్షలాది రూపాయలు ఖర్చు అవుతోంది. సమయానికి నోటిఫికేషన్లు విడుదల చేయాలి. – ప్రియాంక, బీఎడ్‌ కంప్లీట్‌

Advertisement
 
Advertisement
Advertisement