రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 34 నుండి 44 ఏండ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం సరైంది. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ఉద్యోగాల భర్తీ జరగలేదు. వయో పరిమితి పెంచడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో భాగంగా ప్రతి ఏడాది ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి. ప్రభుత్వ నోటిఫికేషన్లు ఆలస్యం చేయడం వలన కోచింగ్ సెంటర్స్ లలో లక్షలాది రూపాయలు వృథా అవుతున్నాయి.
– కె.మనోజ్, పీజీ పూర్తి అయింది


