న్యూస్‌రీల్
ఎన్సీఎస్‌ఎఫ్‌ను బెల్లం ఫ్యాక్టరీగా మార్చేందుకు కృషి
వాతావరణం
ఉదయంనుంచే భానుడి ప్రతాపం మొదలవుతుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత కొనసాగనుంది. వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోతగా ఉంటుంది.
ఫిర్యాదు అందిన వెంటనే..
ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలని సీపీ సాయి చైతన్య అన్నారు.
బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026
– 8లో u
మగ్గిడి గ్రామంలోని ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు..
నిజామాబాద్ లీగల్: జిల్లాలోని గోదావరి నది ఒడ్డున ఉన్న ఆలూరు మండలం దేగాం, ఆర్మూరు మండలం మగ్గిడి గ్రామాలు అవి. ఈ గ్రామాల్లోని ఇటుక బట్టీల్లో కొన్నేళ్లుగా సుమారు వెయ్యి మంది కార్మికులు వెట్టి చాకిరీ చేస్తూ కట్టు బానిసలుగా బతుకుతున్నారు. ఈ కష్టాలకు తాళలేక ఎవరైనా కా ర్మికులు ఎదురు ప్రశ్నిస్తే వారిపై పైశాచికంగా దాడి చేయడం, ఆడా, మగా, పిల్లలు అన్న తేడా లేకుండా మట్టిలో వేసి పశువులను కొట్టినట్టుగా కొట్టడం చేస్తూ వారి పిల్లలను మరో బట్టిలో తమ వద్ద బానిసలుగా పెట్టుకుంటారు. ఈ దాష్టికాలను స్థానిక పో లీసు, లేబర్, రెవెన్యూ, మైన్స్ అధికారులకు ఫిర్యా దు చేస్తే వారికి సైతం లంచాలు ఇచ్చి బట్టీ యజ మానులు తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు. తిరిగి లేబర్లను వారితోనే భయపెట్టిస్తారు. దీంతో కార్మికులు యజమానులకు భయపడి గొడ్డుచాకిరీకి అలవాటు పడిపోయారు. ఇంత చేసినా వారికి రెండు పూటల తిండి దక్కేది కాదు. చివరికి బాబు అనే కార్మికుడు ధైర్యం చేసి తెలంగాణ హై కోర్టులోని రాష్ట్ర లీగల్ సర్వీసు అథారిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో కార్మికులందరీ వెట్టి చారికీ విముక్తి కలిగింది.
జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి అధికారుల బృందంతో మంగళవారం దేగాం, మగ్గిడి గ్రామాల్లోని ఇటుక బట్టీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు ఐదారువందల కార్మికులకు విముక్తి కల్పించారు. ఆర్మూర్ కు చెందిన తిరుపతి రెడ్డి, కిరణ్ రెడ్డి, మల్లిఖార్జున రెడ్డిలు ఇట్టుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల నుంచి దాదాపు వెయ్యి మంది వరకు లేబర్లను తీసుకువచ్చి వారితో తెల్లవారు మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 20 గంటల పాటు పనిచేయిస్తున్నారు. వారికి ఎటువంటి సదుపాయాలు కల్పి ంచడం లేదు. ఈ తనిఖీల్లో నెల్లూరు జి ల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్మికులు తమ కష్టాలను జిల్లా జడ్జితో పాటు అధికారులకు విన్నవించారు.
తాము ఈ ఇటుకబట్టీల్లో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, ఏటా శీతాకాలంలో వచ్చి ఎండకాలం చివరి వరకు ఇటుక తయారీ పనిచేస్తున్నామని తెలిపారు. ఇక్కడి యాజమాన్యాలు తమ కు అడ్వాన్సులు ఇచ్చి ఇక్కడికి తీసుకువచ్చి తక్కువ వేతనాలకు పనిచేయించుకుంటున్నారని వాపోయారు. తమ హక్కులపై మాట్లాడితే ప్రాణాలు తీ స్తున్నారని, ఇప్పటి వరకు ఇక్కడ దాదాపు నలుగురు కార్మికులు ఇక్కడే చనిపోయారని, వారి శవాలను సైతం ఏమిచేసారో తెలియదని బాబు వాపోయాడు. దీంతో జిల్లా జడ్జి ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యు, కార్మిక శాఖ అధికారుల బృందం ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న అక్కడ ఉన్న ఐదారు వందల కార్మికులకు విముక్తి కల్పించారు. కార్మికులకు ఆ ర్మూర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో వసతి కల్పించారు. వేతనాలు ఇప్పించి వారి స్వగ్రామాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. తనిఖీల్లో ఆర్మూర్ సబ్–కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి టి శ్రీదేవి, ఆర్మూర్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రావణి పాల్గొన్నారు.
కాలాపానీలా..
జిల్లాలో ఇటుక బట్టీల్లో చాలీచాలని కూలీలతో వెట్టిచాకిరీ చేస్తున్న సమారు ఐదారు వందల మంది కార్మికులకు జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి విముక్తి కల్పించారు. మగ్గిడి, ఆలూర్ గ్రామాల్లో ఇటుక బట్టి యాజమానులు, కార్మికులతో 20 గంటల పాటు పనిచేయించుకుని చాలీచాలని కూలీలను వారికి ఇస్తున్నారు. కార్మికులు తిరగబడితే వారిని గొడ్డునుబాదినట్టు బాదేవారు. వారి పిల్లలను తమకు సంబంధించిన ఇతర బట్టీల్లో నిర్బంధించారు. ఓ కార్మికుడు రాష్ట్ర న్యాయసేవ సంస్థను ఆశ్రయించడంతో చివరికి వారికి విముక్తి కలిగింది.
ఇటుక బట్టీల్లోని ఐదారువందల కార్మికులకు విముక్తి
అధికారులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా జడ్జి భారత లక్ష్మి
పదిహేనేళ్ల్లుగా బానిసలుగా బతుకుతున్న నెల్లూరు జిల్లా కార్మికులు
రోజుకు ఇరవై గంటలు పని
చేయాల్సిందే.. ప్రశ్నిస్తే బంధించి
పాశవికంగా దాడులు..
ఆడా, మగా, పిల్లలని కనికరం
చూపకుండా మట్టిలో వేసి
కొట్టి హింసించడం
నలుగురు కార్మికులు చనిపోయారు.. వారి శవాలను ఏం చేశారో..: కార్మికుల ఆవేదన
మానవ హక్కులను కాలరాస్త్తున్నారు
ఇటుకబట్టీల్లో యాజమాన్యా లు మానవహక్కులను కాలరాస్తూ లేబర్లతో ఇష్టారీతిన పనిచేయించుకుంటున్నారు. ఇరవై మందికి లేబర్ లైసె న్సు తీసుకుని వెయ్యి మందితో పనిచేయింటుకుంటున్నారు. ఇక్కడి బట్టీల్లో కార్మికులకు సరైన ఆహారం, వైద్యం, వసతి సదుపాయం లేదు. గర్భిణులు, పిల్లలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. వీరికి కనీస సదుపాయాలు లేవు.
– భారతలక్ష్మి, జిల్లా జడ్జి జీవీఎన్


