నిజామాబాద్ రూరల్ : మెడికల్ దుకాణాల బంద్ నేపథ్యంలో బుధవారం అసోసియేషన్ భవనంలో అత్యవసర మందుల సరఫరాకు ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు.
సంప్రదించాల్సిన నంబర్లు..
బి.గంగాధర్ 9848390388
బి.మురళి 9381741474
పెంటి రాజు 9885255801
పి.రాజేందర్ 9440577140
కిరణ్ 9948502161
గంగోత్రివేణు 8686799766
ఎండీ జయిమ్ 8341053588
ఇప్తాకర్ 7893202273
ఏపీ వెళ్లిన ఎన్నారై కమిటీ
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): గల్ఫ్ ఎన్నారై పాలసీ రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు బయల్దేరింది. సీఎం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ యాత్రను ప్రారంభించారు. కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఈ బృందానికి నాయకత్వం వహించారు. కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించి గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం అమలుచేస్తున్న కార్యక్రమాలపై అధ్యయనం చేస్తుంది. ఏపీ వెళ్లిన వారిలో కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్లు సింగిరెడ్డి నరేశ్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావుతోపాటు ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, వలంటీర్ కర్రి పద్మారాణి, ప్రొఫెసర్లు జునుగురు శ్రీనివాస్, విజయ్ కొర్రా, ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
పీహెచ్‌సీల్లో ఎన్‌సీడీ
పరీక్షల సంఖ్యను పెంచాలి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ (ఎన్‌సీడీ) పరీక్షలు చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 50 శాతం కన్నా తక్కువగా నిర్వహించారని, వీహెచ్‌ఆర్‌లో లేని జనాభాకు సైతం ఎన్‌సీడీ పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో సిబ్బందిని ఆదేశించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలోని జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్‌ఎంలతో జాతీ య ఆరోగ్య కార్యక్రమాలపై డీఎంహెచ్‌వో మంగళవారం జూమ్ ద్వారా సమీక్షించారు. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌తో బాధపడే రోగుల డాటాను సేకరించి వ్యా లిడేషన్ చేయాలన్నారు. అధికారులందరూ సమయపాలన పాటిస్తూ కిందిస్థాయి సిబ్బంది సమయపాలన పాటించేలా చూ డాలన్నారు. వ్యాధి నిరోధక టీకాలు, జీవనశైలి వ్యాధుల పరీక్షలు తదితర వారిపై ప లు సూచనాలు చేశారు. జిల్లాలో క్షయ రహి త గ్రామాల సంఖ్యను పెంచాలన్నారు. డీటీసీవో దేవి నాగేశ్వరి, డీఐవో అశోక్, జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ సికిందర్ నాయక్, వైద్యులు సమత, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
విచారణకు
హాజరయ్యేనా?
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో దాఖలైన పరువునష్టం కేసు బుధవారం విచారణకు రానుంది. అయితే ఆయన విచారణకు నేరుగా హాజరవుతారా లేదా అన్న అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన పరువుకు భంగం కలిగించేలా ఎమ్మెల్యే కేవీఆర్ అసత్య ఆరోపణలు చేశారంటూ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తనయుడు మహమ్మద్ ఇలియాస్ ఇటీవల హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. విచారణ నిమిత్తం మే 20వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. బుధవారం కేసు విచారణ ఉండడంతో నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది.


